Homeఆంధ్రప్రదేశ్‌అమరావతికి కొత్త శోభ.. జగన్ ప్లానింగ్ ఇదేనా?

అమరావతికి కొత్త శోభ.. జగన్ ప్లానింగ్ ఇదేనా?

AMRDA to replace APCRDA
ఏపీ రాజధాని విషయంలో రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ముందుకెళుతుండగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని(అమరావతి) అంటున్నారు. ఇటీవలే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సీఆర్డీఏ బిల్లు రద్దుతోపాటు మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలయుద్ధంగా తారాస్థాయికి చేరుకొంది. టీడీపీ చెందిన పలువురు నేతలు ఇప్పటికే రాజీనామా బాటపట్టారు. చంద్రబాబు సైతం రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోనే తాడేపెడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

Also Read: జగన్ కి మేలుచేసేలా బాబు విమర్శలు!

వైసీపీ నేతలు టీడీపీకి ధీటుగా జవాబిస్తుండటంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నారు. వైసీపీకీ చెందిన పలువురు మంత్రులు చంద్రబాబు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేసి అన్ని సీట్లు గెలిస్తే రాజధాని విషయంలో వైసీపీ పునరాలోచిస్తుందంటూ ప్రకటనలు చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది. అయితే అమరావతి ప్రాంతవాసుల్లో ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను దూరంగా చేసేలా సీఎం జగన్ పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అమరావతిని మెట్రో నగరంగా తీర్చిదిద్దేలా జగన్ సర్కార్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొస్తుంది.

సీఆర్డీఏ రద్దుకావడంతో ఇక అమరావతిని మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తాజాగా ఏఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీఆర్డిఏ కంటే ఏఎంఆర్డిఏ పరిధి ఎక్కువ ఉండటంతో ఈప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేదిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఏఎంఆర్డీఏపై ప్రత్యేక కమిటీ వేయడంతోపాటు పాలక మండలి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ పాలక మండలిలో ఏఎంఆర్డీఏ కమిషనర్ గా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని నియమించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, డిప్యూటీ ట్రాన్సోపోర్ట్ కమిషనర్లను సభ్యులుగా నియమించింది. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి.. మెట్రో, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలనేది ఈ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే అమరావతిని మెట్రో నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఏఏంఆర్డీఏ పాలక మండలిని ఆదేశించింది.

Also Read: బాబు లాగా నష్టపోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు

దీంతో అమరావతిలో జగన్ మార్క్ అభివృద్ధి ఖాయమనే టాక్ విన్పిస్తుంది. అమరావతి నుంచి తరలిపోతున్న రాజధానికి చెక్ పెట్టేలా ఆ ప్రాంతాన్ని మెట్రోనగరంగా మార్చనుండటం ఒకరకంగా అక్కడి ప్రజలకు ఊరటనిచ్చే అంశమే. అయితే జగన్ కూడా బాబులా గ్రాఫిక్స్ కే పరిమితమవుతారా? లేదా అమరావతిని అభివృద్ధిని చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version