ఏపీ ఫైబర్ నెట్ స్కాం.. లోకేష్ బుక్కయ్యేనా?

ప్రస్తుతం టీడీపీ మెడకు మరో కుంభకోణం చుట్టుకోనుంది. గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్ కోసం ఇంటింటికి అందించిన సెటాప్ బాక్సుల వినియోగంలో భారీ స్కాం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీపై మరో మరక పడినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అధికార పార్టీ వైసీపీ సైతం టీడీపీపై విమర్శలు చేస్తోంది. దీనిపై కూలంకషంగా విచారణ చేపడితే నిజానిజాలు తెలుస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో […]

Written By: Srinivas, Updated On : July 12, 2021 10:05 am
Follow us on

ప్రస్తుతం టీడీపీ మెడకు మరో కుంభకోణం చుట్టుకోనుంది. గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్ కోసం ఇంటింటికి అందించిన సెటాప్ బాక్సుల వినియోగంలో భారీ స్కాం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీపై మరో మరక పడినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అధికార పార్టీ వైసీపీ సైతం టీడీపీపై విమర్శలు చేస్తోంది. దీనిపై కూలంకషంగా విచారణ చేపడితే నిజానిజాలు తెలుస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ నెట్ లో భారీ కుంభకోణం జరిగినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ లిమిటెడ్ లో గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ రాష్ర్ట ప్రభుత్వ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్లు ఇవ్వాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. సెటాప్ బాక్సులు సహా సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం టెండర్లు పిలిచింది. వీటిలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కుంభకోణం వెనక అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అవకతవకలపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఏపీ ఫైబర్ నెట్ ఎండీ, చైర్మన్లు సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కోరారు. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన అనంతరం కేసును సీఐడీకి అప్పగించారు. అవకతవకలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ అదనపు డీజీని ప్రభుత్వం ఆదేశించింది.

ఫైబర్ నెట్ కుంభకోణం వెనుక టీడీపీ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని సమాచారం. ఈ క్రమంలో లోకేష్ ను కేంద్రంగా చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.