AP and Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కారణం రెండూ అప్పుల్లో కూరుకుపోతున్నాయి. తెలంగాణ ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెబుతున్నా రాష్ట్రంపై ప్రస్తుతం రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీ కూడా అప్పుల కుప్పగా మారింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో కొలువు తీరిన ప్రభుత్వాలు అప్పులు తగ్గించేందుకు కృషి చేయాల్సింది పోయి అధికారం కోసం ప్రజలను సంక్షేమ పథకాలకు బానిసలను చేసి తమ హామీలను తీర్చేందుకు అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలకు డబ్బులన్నీ వెచ్చిస్తున్నారు.
ఫలితంలో రెండు రాష్ట్రాల్లో నిరుద్యోగులు, ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని తెలసింది. ఇటు తెలంగాణ , అటు ఏపీ ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పీఆర్సీ, అలవెన్సులు, డీఏల పెంపు విషయంలో ఆలస్యం చేస్తున్నాయి. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ముందుకు కదలడం లేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించి హెఆర్‌ఏ కేంద్రంతో సమానంగా డిక్లేర్ చేయడంతో ఉద్యోగులు పెదవి విరిచారు. తెలంగాణ ఉద్యోగులతో పోలిస్తే తాము నష్టపోయామని.. తమ కంటే వాళ్లే సంతోషంగా ఉన్నారనే భావనలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: ఉద్యోగులకు దక్కని సానుభూతి.. స్వయం కృతాపరాధమేనా?
తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించగా, ఏపీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం 23శాతం మాత్రమే ఇచ్చింది. దీంతో 2013 పీఆర్సీ ప్రకారం రూ.37100 కనీస వేతనం ఉన్న సెక్షన్ ఆఫీసర్ కేడర్ ఉద్యోగికి 2018 పీఆర్సీ 30శాతం యాడ్ అయితే.. 2018 జూలె 7 నుంచి 30.392 శాతం డీఏ కలిసి లెక్కిస్తే రూ.60,480 కనీస మూలవేతం వస్తుంది. దానికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏ, రూ.1250 సీసీఏ కలిపితే రూ.76,245 వేతనం వస్తోంది. 2019 జనవరి 1 నుంచి 2021 జూలై 1 వరకు పెండింగ్ డీఏలన కలిపితే ఉద్యోగికి మొత్తం రూ.88,353 వేతనం వస్తున్నది.
ఏపీలో 2013 పీఆర్సీ ప్రకారం రూ.37,100 కనీస మూలవేతనం ఉన్న సెక్షన్ ఆఫీసర్ కేడర్ ఉద్యోగికి 2018 పీఆర్సీ ప్రకారం 23శాతం ఫిట్ మెంట్, 30.392 శాతం డీఏ లెక్కిస్తే కనీస మూల వేతనం రూ.57,220 అవుతుంది. దానికి 16శాతం హెచ్ఆర్ ఏ కలిపితే రూ.66,375 అవుతుంది. పెండింగ్ డీఏలను కలిపితే వేతనం రూ. 77,831 అవుతుంది. ఈ మొత్తాన్ని తెలంగాణ ఉద్యోగుల జీతంలో పోల్చి చూసినప్పుడు రూ.10,522 వ్యత్యాసం వస్తోంది. దీంతో ఏపీ ఉద్యోగులు ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోపై, అటు ఉద్యోగ సంఘాల నేతలపై మండిపడుతున్నారు. వారు చేయబట్టే తాము తక్కువ వేతనం పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు రద్దు చేసుకున్నాడు? కారణం అదేనా?