https://oktelugu.com/

Allu Arjun fans fire on Hyper Aadi: వివాదంలో హైపర్ ఆది స్కిట్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్.. ప్రసారం ఆపివేయాలని డిమాండ్

Allu Arjun fans fire on Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్స్ లో హైపర్ ఆది తెలియనివారంటూ ఉండరు. టీమ్ మెంబర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆది తన కామెడీ స్కిట్స్ తో టీమ్ లీడర్ అయ్యాడు. ఐదేళ్లకు పైగా తన నాన్ స్టాప్ కామెడీ స్కిట్స్ తో అలరిస్తున్నాడు. అదే క్రమంలో హైపర్ ఆది స్కిట్స్ పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. కొందరు వ్యక్తులు వ్యవస్థలను అతడు కించపరిచాడంటూ వ్యతిరేకత చెలరేగింది. ఆ మధ్య హైదరాబాద్ రోడ్ల […]

Written By:
  • Shiva
  • , Updated On : January 19, 2022 / 03:05 PM IST
    Follow us on

    Allu Arjun fans fire on Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్స్ లో హైపర్ ఆది తెలియనివారంటూ ఉండరు. టీమ్ మెంబర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆది తన కామెడీ స్కిట్స్ తో టీమ్ లీడర్ అయ్యాడు. ఐదేళ్లకు పైగా తన నాన్ స్టాప్ కామెడీ స్కిట్స్ తో అలరిస్తున్నాడు. అదే క్రమంలో హైపర్ ఆది స్కిట్స్ పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. కొందరు వ్యక్తులు వ్యవస్థలను అతడు కించపరిచాడంటూ వ్యతిరేకత చెలరేగింది. ఆ మధ్య హైదరాబాద్ రోడ్ల గురించి సెటైర్ వేయగా.. తెలంగాణా ప్రజలు మండిపడ్డారు.

    Allu Arjun fans fire on Hyper Aadi

    ఇక మరో కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును అనుకరిస్తూ… అవమానపరిచాడని కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో మంచు విష్ణు మనుషులు హైపర్ ఆదికి గట్టి వార్నింగ్ ఇచ్చారని పుకార్లు వినిపించాయి. సమకాలీన విషయాలపై ఆది సెటైర్స్ నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో వివాదాస్పదం కూడా అవుతున్నాయి.

    తాజాగా హైపర్ ఆది ‘పుష్ప’ మూవీ స్పూఫ్ చేశాడు. ఆది పుష్ప గెటప్ వేయగా… కేశవ రోల్ ఒరిజినల్ గా సినిమాలో చేసిన జగదీష్ ప్రతాప్ బండారి వేశాడు. ప్రశాంతి అనసూయ గెటప్ వేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైంది. ఇక పుష్ప స్పూఫ్ స్కిట్ లో ఎప్పటిలాగే హైపర్ ఆది రెచ్చిపోయాడు. పుష్ప గూనిపై హైపర్ ఆది వేసిన పంచ్ మాములుగా పేలలేదు. ఎందుకు అలా భుజం పైకి పోయిందంటే… బైక్ పై ఫోన్ మాట్లాడి మాట్లాడి అలా వచ్చేసిందని పంచ్ వదిలాడు.

    Also Read: బంగార్రాజు డైరెక్టర్ కి ఎదురైన చేదు అనుభవం.. పనికిరావ్ పో అన్నారు!

    అయితే పుష్ప మూవీ స్పూఫ్ చేయడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. పుష్ప మూవీ దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీలో భారీ విజయం అందుకొని అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇంకా థియేటర్స్ లో పుష్ప సందడి తగ్గలేదు. హిట్ మూవీగా పుష్ప థియేటర్స్ లో ఉండగానే ఈ స్పూఫ్ స్కిట్స్ చేయడం ఏమిటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏకంగా ఈ స్కిట్ ప్రదర్శించకూడదని డిమాండ్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిమాండ్ కి జబర్దస్త్ నిర్వాహకులు ఎంత వరకు తలొగ్గుతారో చూడాలి.

    మరోవైపు పుష్ప హిందీలో ఆదరణ దక్కించుకోగా… అల వైకుంఠపురంలో హిందీ వర్షన్ విడుదలకు సిద్ధం చేశారు. జనవరి 26 రిపబ్లిక్ డే కానుకగా అల వైకుంఠపురంలో హిందీ వర్షన్ థియేటర్స్ లో విడుదల కానుంది. అలాగే రామ్ చరణ్ రంగస్థలం హిందీ వర్షన్ కూడా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు సమాచారం.

    Also Read: చిరంజీవితో మాట్లాడా.. జగన్‌కు కృతజ్ఞతలు – నాగార్జున

    Tags