https://oktelugu.com/

AP Employees: సమ్మె చేయాలని ఉద్యోగులను చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ రెచ్చగొడుతున్నారా?

AP Employees: ఏపీ ఉద్యోగుల సమ్మె ఇప్పుడు ఎందుకు సమిసిపోయింది. విజయవాడలో రచ్చరచ్చ చేసిన ఏపీ ఉద్యోగులు జగన్ సర్కార్ తో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు.? ఏపీ మంత్రులు ఏం చెప్పి బుజ్జగించారు? ఉద్యోగులు ఎందుకు సమ్మె విరమించారు.. ఇప్పుడిదే ఏపీలో రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రధానంగా సమ్మె జరిగితే ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని రెడీ అయిన ప్రతిపక్ష టీడీపీ, జనసేన సహా టీడీపీ అనుకూల మీడియాకు సమ్మె విరమణ మింగుడుపడని వ్యవహారంగా మారింది. అందుకే […]

Written By:
  • NARESH
  • , Updated On : February 8, 2022 / 04:03 PM IST
    Follow us on

    AP Employees: ఏపీ ఉద్యోగుల సమ్మె ఇప్పుడు ఎందుకు సమిసిపోయింది. విజయవాడలో రచ్చరచ్చ చేసిన ఏపీ ఉద్యోగులు జగన్ సర్కార్ తో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు.? ఏపీ మంత్రులు ఏం చెప్పి బుజ్జగించారు? ఉద్యోగులు ఎందుకు సమ్మె విరమించారు.. ఇప్పుడిదే ఏపీలో రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రధానంగా సమ్మె జరిగితే ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని రెడీ అయిన ప్రతిపక్ష టీడీపీ, జనసేన సహా టీడీపీ అనుకూల మీడియాకు సమ్మె విరమణ మింగుడుపడని వ్యవహారంగా మారింది. అందుకే ఉద్యోగులు సమ్మె విరమించడాన్ని టీడీపీ, దాని అనుకూల మీడియా సహించడం లేదు. వారిని ఎలాగోలా రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించించేసింది.

    రాష్ట్ర ప్రభుత్వంపై వామపక్షాలను ఉసిగొల్పుతున్న తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియాపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం విరుచుకుపడ్డారు. తాడేపల్లి కార్యాలయంలో జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమించడాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన మీడియా తొత్తులు – ఈనాడు సీహెచ్ రామోజీరావు, ఆంధ్రజ్యోతి వి రాధాకృష్ణ మాత్రమే సహించలేకపోతున్నారని ఆక్రోశించారు. “ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగించాలని వారు తీవ్రంగా కోరుకుంటున్నారు. సమ్మె ఇలాగే కొనసాగితే ఎల్లో మీడియాకు పెద్ద పండుగే. సమ్మె విరమించారంటూ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కమ్యూనిస్టు పార్టీలను రెచ్చగొట్టి ఆందోళనలు కొనసాగించారు’’ అని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

    ముఖ్యమంత్రిని ఎవరైనా దుర్భాషలాడితే ఈ ఎల్లో మీడియా పెద్దఎత్తున కవరేజీ ఇస్తుందని జగన్ ఆరోపించారు. ఉద్యోగులు సమ్మె విరమించిన తర్వాత కూడా టీడీపీ, దాని మద్దతు మీడియా ఉద్యోగుల నేతలను అమ్ముడుపోయాయని ఆరోపిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    దళితులుగా పుట్టడం ఎవరికీ ఇష్టం లేదని చెప్పిన వ్యక్తి రామోజీరావుకు ఇప్పుడు ప్రియశిష్యుడిలా మారాడు. బీసీల రెక్కలు ముక్కలు చేస్తానని బెదిరించిన వ్యక్తి రాధాకృష్ణకు అత్యంత సన్నిహితుడు’’ అని చంద్రబాబును ఉద్దేశించి జగన్ సంచలన ఆరోపణలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులుగా బీసీలు అర్హులు కాదని చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. ‘‘పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని ఆపించేశాడన్నారు. అలాంటి పేదల వ్యతిరేకి ఇప్పుడు వామపక్షాలకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారడం హాస్యాస్పదమని జగన్ విమర్శించారు.

    దీన్ని బట్టి సమ్మె ఆగిపోవడం ఖచ్చితంగా టీడీపీకి, దాని అనుకూల మీడియాకు మింగుడు పడని వ్యవహారంగా మారిందని తెలుస్తోంది. ఆ వేడి జగన్ కు కూడా తగలడంతో ఆయన బయటకు వచ్చి ఇలా బరెస్ట్ అయ్యారు. తొలిసారి జగన్ ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లపై నేరుగా విరుచుకుపడ్డారు. దీన్ని బట్టి సమ్మె విరమణ టీడీపీ శిబిరంలోనే నిజంగా ఆందోళనకు కారణమైనట్టు తెలుస్తోంది. సమ్మె చేయాలని.. చేయించాలని టీడీపీ కుట్రలు మొదలుపెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది. మరి టీడీపీ ఆవేదన, ఆందోళన నిజమేనా? ఉద్యోగుల సమ్మె విరమణ వారికి నిజంగానే కంటగింపుగా మారిందా? అన్నది వేచిచూడాలి.