AP Drugs Case: గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు పునుక్కున్నట్లుగా ఉంది ఏపి పరిస్థితి. తెలంగాణలో డ్రగ్స్ కేసు విచారణలో ఉండగా అధికార పార్టీ టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ నే లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో తమకేమీ సంబంధం లేదని ఏపీ పోలీసులు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కేంద్రంగా అషి ట్రేడింగ్ కంపెనీ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ లోని ముంద్రా పోర్టు నుంచి మత్తు పదార్థాల వ్యాపారం సాగుతుందని సమాచారం. అయితే మత్తు పదార్థాల వ్యాపారం గురించి కేంద్ర దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. పోలీసులు తమకేమీ సంబంధం లేదని చెప్పడంతో సందేహాలు వస్తున్నాయి. ఏపీతో డ్రగ్స్ కేసుకు సంబంధాలు ఉంటాయని తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం బుకాయించడం అనుమానాలకు తావిస్తోంది.
మత్తు పదార్థాల వ్యాపారం అఫ్గనిస్తాన్ కేంద్రంగా జరుగుతోంది. తాలిబన్ల చేతులో ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జిస్తున్నారు. డ్రగ్స్ వ్యాపారంలో వారిదే ఆరితేరిన చేయి. దాదాపు అన్ని దేశాలకు అక్కడి నుంచే మత్తు పదార్థాల రవాణా జరుగుతోంది. అది కూడా ఏపీ నుంచే ఇతర ప్రాంతాలకు వస్తున్నట్లు ఆధారాలున్నాయని ఇప్పటికే తెలిసింది. కానీ పోలీసులు మాత్రం మాకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం.
అయితే అధికార పార్టీ వైసీపీ కంగారు పడి తమ మీదకు ఎక్కడ వస్తుందోననే అనుమానంతోనే ఇలా ప్రవర్తిస్తుందని తెలుస్తోంది. మాకేమి సంబంధం లేదన్నంత మాత్రాన నిజాలు అబద్దాలై పోతాయా అని ప్రశ్నిస్తున్నారు. ఏపీ తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడంపై అందరిలో సందేహాలు వస్తున్నాయి. ఎవరి పనులు వారు చేస్తేనే బాగుంటుంది. సంబంధం లేని విషయాల్లో కల్పించుకుని ఇలా చేయడం సమంజసం కాదని చెబుతున్నారు.