AP CM Jagan: ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశమై దిశా నిర్దేశం చేస్తున్నారు. రెండో సారి ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నారు. గతసారి వచ్చిన మెజార్టీ కంటే మరిన్ని ఎక్కువ స్థానాలు తెచ్చుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ప్లీనరీలో సమర శంఖం పూరించారు. అటు తరువాత ఎమ్మెల్యేలు, మంత్రులకు వర్కుషాపు నిర్వహించారు. స్పష్టమైన సూచనలు, ఆదేశాలు జారీచేశారు. రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చరించారు. 175 స్థానాల్లో గెలుపొందేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అయితే 175 మాట దేవుడెరుగు…కానీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం ఆ ఐదుగురు మాత్రం ఓడిపోవాలని.. అందుకు అనుగుణంగా శ్రేణులు పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. ఆ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించారు. అయిదుగురులో ఒకరు చంద్రబాబు, రెండోది ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు. వీరు ఐదుగుర్ని ఎట్టి పరిస్థితుల్లో మట్టి కరిపించాలని జగన్ కసితో ఉన్నారు. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా? అన్నప్రశ్న వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇందులో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, గద్దె రామ్మోహనరావులు టీడీపీ కాగా.. పవన్ ఒక్కరే జనసేన. అయితే జగన్ మాత్రం వీరిపై వేర్వేరు కారణాలతో ఓడించాలనుకుంటున్నారు.

కుప్పంలో మైండ్ గేమ్..
తాను సీఎం అయితేనే శాసనసభకు వస్తానని చంద్రబాబు ప్రతినబూనిన సంగతి తెలిసిందే. అందుకే కుప్పంలో చంద్రబాబును ఓడించి రాజకీయంగా దెబ్బతీయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దీంతో అక్కడ టీడీపీ నుంచి వైసీపీలో చేరికలను ఆయన ప్రోత్సహిస్తున్నారు. వివిధ రకాల తాయిలాలు చూపి టీడీపీ కేడర్ ను తిప్పుకోవడానికి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ వైసీపీ మైండ్ గేమ్ మొదలు పెట్టింది. కానీ చంద్రబాబు అప్రమత్తమయ్యారు. వైసీపీలోకి టీడీపీ శ్రేణులు వెళ్లకుండా అడ్డుకోగలిగారు. తరచూ కుప్పంలో పర్యటిస్తూ పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టారు. దీంతో వైసీపీ ప్రయత్నాలేవీ ఇక్కడ పారడం లేదు.
Also Read: Jagan Politics : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఓడించడం జగన్ కు సాధ్యమవుతుందా?
టెక్కలిలో అచ్చెన్నను...
టెక్కలిలో అచ్చెన్నాయుడును ఓడించాలన్న కసితో జగన్ ఉన్నారు. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్న అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల తరువాత అసెంబ్లీకి రాకూడదన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే అక్కడ వైసీపీ శ్రేణులను మొహరించారు. అచ్చెన్నపై సవాల్ చేస్తూ వస్తున్న దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆయన్ను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా అచ్చెన్నపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడ అచ్చెన్నపై పైచేయి మాత్రం సాధ్యం కావడం లేదు. దీనికితోడు వైసీపీ లో వర్గ విభేదాలు పెరుగుతున్నాయి. ముదిరిపాకాన పడుతున్నాయి. సొంత పార్టీ శ్రేణులే దువ్వాడను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అచ్చెన్నను ఢీకొట్టడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
బుచ్చయ్యపై…
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై కూడా జగన్ అక్కసుతో ఉన్నారు. అతిగా వ్యవహరిస్తారని ఆయనపై కోపం పెంచుకున్నారు. రాజకీయాల నుంచి విరమిస్తానని చెప్పుకొచ్చే బుచ్చయ్య తరచూ జగన్ పై కామెంట్ చేస్తుంటారు. ఇది జగన్ కు మింగుడు పడడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో బుచ్చయ్యను ఓడించాలని నిర్ణయించుకున్నారు. శ్రేణులకు కూడా దిశా నిర్దేశం చేశారు. కానీ అది జరిగే పనేనా అన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది. గత ఎన్నికలకు ముందు రాజమండ్రి అర్బన్ నుంచి రూరల్ కు మారిన ఆయనకు మంచి పట్టు ఉంది. దీనికితోడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత తోడైంది. దీంతో ఆయన్ను ఓడించడంపై వైసీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గద్దె రామ్మోహన్ నాయుడు సత్తా చాటారు. బలమైన కేడర్ ఉన్న నేత. ప్రజల్లో కూడా మంచి పేరే ఉంది. రామ్మోహన్ పై జగన్ కు వ్యక్తిగతంగా ఏమీలేకున్నా రాజధాని ప్రాంతం కావడంతో..రామ్మోహన్ ను ఓడించి గట్టి సవాల్ విసరాలని జగన్ భావిస్తున్నారు. ఇక్కడ గట్టి అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించారు. అయితే గత ఎన్నికల సమయంలో వైసీపీ వేవ్ లో గెలిచిన రామ్మోహన్ ను ఇప్పుడు ఓడించడం సాధ్యమయ్యే పనికాదన్న వాదన ఉంది.

పవన్ ను దెబ్బతీయాలని..
ఇక పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని తాకనివ్వకూడదని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాతో పనిచేసిన జగన్ సక్సెస్ అయ్యారు. పవన్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా ఓడించారు. ఈసారి కూడా పవన్ ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం పవన్ ఎక్కడి నుంచి పోటీచేస్తారో క్లారిటీ లేదు. ఎక్కడ నుంచి పోటీచేసినా పవన్ ను మాత్రం ఓడించి తీరాలని భావిస్తున్నారు. తనను గెలవనివ్వని పవన్ చేసిన శపధంతో జగన్ ఈ నిర్ణయానికి వచ్చారు. కానీ ఇది సాధ్యమయ్యే పనేనా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే జనసేన గ్రాఫ్ పెరిగింది. అందునా పవన్ ను ఓడించి పొరపాటు చేశామని ప్రజల్లో బాధ వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీతో పొత్తు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగే పవన్ ను ఓడించడం అయ్యే పనికాదని వైసీపీ శ్రేణులే చేతులెత్తేస్తున్నాయి.
Also Read:MLA Komatireddy Rajgopal Reddy: అమిత్ షా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యలో నిషికాంత్ దూబే
[…] […]