Jagan Politics : ‘బాహుబలి సినిమాలో మాహిష్మతి సైన్యం తక్కువైనా.. కాలకేయుడి సైన్యం ఎక్కువైనా సరే.. వారి రాజైన కాలకేయుడిని చంపితే ఆ సైన్యం చెదిరిపోయింది’ ఇప్పుడు ఇదే స్ట్రాటజీని వైఎస్ జగన్ అమలు చేస్తున్నారట.. వైసీపీ, జనసేనలను కొట్టాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఓడిస్తే సరిపోతుందని జగన్ వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది.

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ప్రత్యర్థి పార్టీలను కోలుకోకుండా దెబ్బతీయాలి. అధినేతలనే ఓడిస్తే పార్టీ చెల్లాచెదురు అవుతుంది. నేతలు, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది. పార్టీ అధ్యక్షులే ఓడిపోతే నైతిక స్థైర్యం దెబ్బతిని అందరూ పార్టీలు మారిపోతారు. ఇదే స్కెచ్ ను గీసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారట వైఎస్ జగన్. ఈ దెబ్బతో ముఖ్యంగా చంద్రబాబు, పవన్ లను కొట్టాలని తాపత్రాయపడుతున్నారు.
కుప్పంతోపాటు మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవడమే ధ్యేయంగా జగన్ ముందుకు సాగుతున్నారు. అంతర్గత సమాచారం ప్రకారం.. సీఎం జగన్ ప్రధానంగా ఐదుగురిని ఓడించేందుకు ఆ నియోజకవర్గాల్లో సామధాన భేద దండోపాయాలను ప్రయోగించేందుకు రెడీ అయ్యారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ను.. కుప్పంలో చంద్రబాబు, టెక్కలిలో అచ్చెన్నాయుడు, రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి, విజయవాడ ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ రావును ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నారట..
ఇప్పటికే కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలను మంత్రి పెద్దిరెడ్డి చాణక్యంతో స్వీప్ చేసింది వైసీపీ. చంద్రబాబును ఓడించమే ధ్యేయంగా టీడీపీ క్యాడర్ ను లాగేసి మైండ్ గేమ్ ఆడుతోంది. పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తున్నారు. రోజురోజుకు పార్టీ పరువు పోతుందని టీడీపీ క్యాడర్ భయపడుతోంది. చంద్రబాబు తర్వాత జగన్ ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడిపై పడింది. ఇక జగన్ ను టార్గెట్ చేసి ఇరుకునపెడుతున్న బుచ్చయ్య చౌదరి, గద్దె రామ్మోహన్ లను ఓడించాలని చూస్తున్నారు. రాజధాని మండలాల్లో వైసీపీ బలం నిరూపించుకునేందుకు గద్దెను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక 2019లో పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు కోట్లు కుమ్మరించి కుట్ర చేసి పవన్ ను కావాలనే ఓడించారనే టాక్ ఉంది. ఈసారి కూడా ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాన్ ను గెలవనీయకూడదని.. 2019 ఫలితలను పునరావృతం చేయాలని జగన్ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.
అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఇంతటి వ్యతిరేకతలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఓడించడం అసాధ్యమంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి పక్కా గెలిచే నియోజకవర్గాన్నే ఎంచుకోబోతున్నారట.. పైగా ప్రజల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున సాయం, సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి ఇమేజ్ ను సంపాదించారు. ఇక చంద్రబాబుకు పెట్టని కోట అయిన కుప్పంలో కొట్టడం అంత ఈజీ కాదు. నేతలు పోయినా ప్రజా బలం చంద్రబాబు సొంతం. అందుకే జగన్ టార్గెట్ ఫలించడం కొంచెం కష్టమేనంటున్నారు.
ఏపీలో పరిస్థితులు జగన్ కు అనుకూలంగా లేవని ప్రతిపక్ష చంద్రబాబు, పవన్ లు భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపు వచ్చినంత మాత్రాన జగన్ వాపును చూసి బలుపు అనుకోవడానికి లేదంటున్నారు. ఉప ఎన్నికల్లో ఎప్పుడైనా అభివృద్ధి కోణంలో అధికార పార్టీకే ప్రజలు పట్టం కడుతారు. కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి ప్రజల మూడ్ మొత్తం మారిపోతుంది. నిజంగా ముందస్తుకు వెళితే జగన్ కు ఓటమి ఖాయమనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే అన్ని వర్గాల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అసంతృప్తి జ్వాల ఎగిసిపడుతోంది. ఎన్నికలు వస్తే 175 సీట్లు టార్గెట్ చేసిన జగన్ కు రెండంకెల సీట్లకు పడిపోవడం ఖాయమంటున్నారు. ఏదో అనుకుంటే ఏదో జరగడం ఖాయమంటున్నారు. మరి జగన్ పంతం నెగ్గుతుందా? ప్రతిపక్షాల పట్టుదల నిలుస్తుందా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ఓటమి సాధ్యమేనా? అన్నది వేచిచూడాలి.
[…] Also Read: Jagan Politics : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఓడి… […]