దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రజలపై ఆర్థికంగా మాత్రమే కాక ఆరోగ్య పరంగా కూడా తీవ్ర ప్రభావం చూపింది. సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ వల్ల మిగతా వాళ్లతో పోలిస్తే వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ మొదలైన సమయంలో ఒక రైతు వలస కార్మికులను బీహార్ కు పంపిన సంగతి తెలిసిందే.
Also Read : సివిల్స్ సాధించాలంటే ఈ ఫోన్ వాడండి!
లక్ష రూపాయలు ఖర్చు చేసి పుట్టుగొడుగుల వ్యాపారం చేసే పప్పన్ సింగ్ అనే రైతు మేలో వలస కార్మికులను సొంతూళ్లకు పంపగా వాళ్లు తిరిగి చేరుకునేందుకు టికెట్లను బుక్ చేశారు. ఆగష్టు నెల 27వ తేదీన వలస కార్మికులు పాట్నా నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారని తెలుస్తోంది. వలస కార్మికులు ఢిల్లీకి వెళ్లేందుకు రైళ్లను బుక్ చేసుకోవాలని ప్రయత్నించినా రైళ్లు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.
రైతు పప్పన్ సింగ్ మాట్లాడుతూ వలస కార్మికులు పాట్నా విమానాశ్రయం చేరుకోవడానికి ఆన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గతంలో మూడు ఎకరాల్లో పుట్టగొడుగుల పెంపకం చేపట్టేవాడినని ఈసారి కేవలం ఎకరం భూమిలో మాత్రమే పుట్టగొడుగుల పెంపకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మార్కెట్లు మూసి ఉండటం వల్ల పుట్టగొడుగుల స్టాక్ మిగిలిపోతోందని తెలిపారు. సీజన్ ప్రారంభం అవుతుండటంతో పదిమందికి టికెట్లు బుక్ చేశానని అన్నారు.
Also Read : ఆ విద్యార్థి చదువు కోసం ఊరికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన సోనూసూద్!