Homeఆంధ్రప్రదేశ్‌AP Govt: తగ్గడమే బెస్ట్.. ఉద్యోగ సంఘాలను చర్చల దిశగా బతిమాలుతున్న జగన్ సర్కార్..!

AP Govt: తగ్గడమే బెస్ట్.. ఉద్యోగ సంఘాలను చర్చల దిశగా బతిమాలుతున్న జగన్ సర్కార్..!

AP Govt: ఏపీ సర్కారు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ ఫైట్.. కొనసాగుతోంది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ప్రభుత్వంపైన తీవ్రంగా ఉంటుందని సర్కారు గ్రహించింది. ఇప్పటికే ‘చలో విజయవాడ’ కార్యక్రమం సక్సెస్ అయింది. ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. త్వరలో సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది.

AP Govt
AP Govt

 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చర్చల కమిటీ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి వారితో మాట్లాడాలని సూచించారు. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నేతలను రాత్రి పూట పిలిపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంతా తానై వ్యవహరించారు. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చేందుకుగాను ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించినట్లు సమాచారం. హెచ్‌ఆర్ఏ పెంపుతో పాటు సీసీసీ, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి విషయాల్లో నిర్ణయాలు వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం తరఫున హామీలు ఇచ్చారని టాక్.

అయితే, ఇప్పటి వరకు తాము సర్కారు ముందు ఉంచిన మూడు డిమాండ్లపైన మాట్లాడితేనే చర్చల ప్రక్రియ స్టార్ట్ చేద్దామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. అవేంటంటే.. పీఆర్సీ గురించి అర్ధరాత్రి ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవడం, దాంతో పాటు పాత వేతనాలను ఇవ్వడం, మూడోది పీఆర్సీ నివేదిక ఇవ్వడం, ఇప్పటికే వేసిన వేతనాను కేన్సల్ చేసి మళ్లీ పాత లెక్కల ప్రకారం వేతనాలు చెల్లించడం… ఈ మూడు డిమాండ్లపైన స్పష్టత ఇస్తే కనుక తాము చర్చల గురించి మాట్లాడుతామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read: Andhra Pradesh: సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి కుంప‌ట్లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్

ఏపీ సర్కారు ఈ విషయాలపైన స్పష్టమైన ప్రకటనలయితే చేయలేదు. కాగా, సమ్మెకు వెళ్లక మునుపే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చి పరిష్కార మార్గం చూపాని ఏపీ సర్కారు పెద్దలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి ఉద్యోగులందరూ సమ్మెకు వెళ్లబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. కాగా, ప్రభుత్వం చర్చల దిశగా అడుగులు వేస్తున్నది. ఉద్యమాన్ని చీల్చేందుకుగాను ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. చర్చల కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకుగాను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..

Also Read: Jagan vs AP Employees: ఉద్యోగుల్లో చీలిక తెచ్చే దిశగా.. జగన్ సర్కారు ఎత్తుగడలివే..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

3 COMMENTS

  1. […] Samanyudu: మూడో వేవ్‌ నడుస్తుండడంతో గత రెండు వారాల నుంచి పెద్దగా పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ రాలేదు. అయితే, ఈ శుక్రవారం విశాల్ నటించిన సామాన్యుడు కాస్త పెద్ద సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తర్వాత ఈ సినిమా హిట్ సినిమాగా నిలిచింది అని టాక్ వినిపించింది. […]

  2. […] Rana Daggubati: నేషనల్ స్టార్ గా రానాకి మంచి గుర్తింపు ఉంది. అలాంటి దగ్గుబాటి రానా నటించిన ‘1945’ మూవీ ఈ నెల 7 నుంచి సన్‌ నెక్స్ట్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలో రానా సరసన రెజీనా నటించింది. ఐతే, నేషనల్ స్టార్ గా రానాకి మంచి గుర్తింపు ఉంది. అయితే, గుర్తింపు తప్ప మార్కెట్ లేదు అని ఈ సినిమాతో తేలిపోయింది. ఈ సినిమాకు చాలా దారుణంగా కలెక్షన్స్ వచ్చాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular