CM Jagan- Ali: తన ప్రియ మిత్రుడు.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కాదని రాజకీయ పునరావాసానికి జగన్ పంచన చేరాడు కమెడియన్ అలీ. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయాల బాట పట్టారు. జనసేనను కాదని వైసీపీలో 2019 ఎన్నికల ముందు ఆర్భాటంగా చేరారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో జగన్ కూడా అక్కున చేర్చుకున్నాడు. వైసీపీకి అలీ ప్రచారం కూడా చేశారు. కట్ చేస్తే.. జగన్ కు అధికారం వచ్చింది.. అలీని జగన్ మరిచిపోయారు.
వైసీపీ అధికారంలోకి రావడంతో తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారని.. లేదంటే ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇస్తారని అలీ బోలెడు ఆశలు పెంచుకున్నారు. కానీ వాటిని ఏవీ కూడా జగన్ నెరవేర్చడం లేదు. ఇదివరకూ ఒక దఫా రాజ్యసభ సీట్లు పంపకాలు పూర్తయ్యాయి. వైసీపీ నేతలు, ఒక కార్పొరేట్ కు రాజ్యసభ సీట్లు ఇచ్చాడు జగన్. ఇప్పుడు మరోసారి వైసీపీకి రాజ్యసభ సీట్లు పొందే అవకాశం వచ్చింది.
Also Read: CM KCR- CS Somesh Kumars: సీఎస్ సోమేష్ కు కేసీఆర్ మంగళం పాడుతున్నారా?
వచ్చే నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వైసీపీకి వచ్చే నాలుగు సీట్లలో ఒకటి అదానీ కోటాలో ఎప్పుడో తేలిపోయింది. అదానీ భార్యను జగన్ రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నట్లుగా వైసీపీలో గట్టిగా నమ్ముతున్నారు. ఇక రెండు స్థానాలు ఉంటాయి. అందులో విజయసాయిరెడ్డికి ఒకటి రెన్యూవల్ చేయాలి. ఆయన విస్మరిస్తే నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చింది కాబట్టి జగన్ ఆయనకు మళ్లీ సీటు ఇవ్వడం ఖాయం. ఇక రెండు స్థానాలు మాత్రమే ఉంటాయి.
ఇక రెండు స్థానాలు మాత్రమే ఉంటాయి. ఆ రెండింటిలో మరొకటి జగన్ అక్రమాస్తుల కేసు వాదించే లాయర్ నిరంజన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. జగన్ ఆయనకు ఆ పదవి ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నారని చెబుతున్నారు. అంటే మిగిలేది ఇక ఒకే ఒక్క పోస్ట్.. దాని కోసం చాలా మంది బీసీ నేతలు రెడీగా ఉన్నారు.
జగన్ పై సీనియర్ నేతలు అవకాశం కోసం ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అనేక పేర్లు తెర ముందుకు వస్తున్నాయి. సినీ నటుడు ఆలీ పేరు మాత్రం ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో సీఎం జగన్ రాజ్యసభ ప్రాబబుల్స్ నుంచి ఆయన పేరును తప్పించారని భావిస్తున్నారు.
దీంతో కమెడియన్ అలీ రేసులో లేరని తెలుస్తోంది. జగన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అలీకి ఇది శరాఘాతంగా మారింది. రెండు వారాల్లో గుడ్ న్యూస్ అలీకి చెప్పిన జగన్ ఇప్పుడు రాజ్యసభ తప్పించి ఏదో ఒక నామినేటెడ్ పోస్టును కట్టబెడుతారని ప్రచారం సాగుతోంది.
Also Read:Chandrababu Badude Badudu Tours: జగన్ టార్గెట్ గా చంద్రబాబు ‘బాదుడే బాదుడు’ టూర్లు..