AP Capital City: రాజధానుల వ్యవహారంపై పార్టీల టార్గెట్ 2024నా?

AP Capital City: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు పలు మలుపులు తిరుగుతున్నాయి. కీలక నిర్ణయాలపై తీర్పులు వెలువడక మధ్యలోనే ఆగిపోయాయి. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం తీరును ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో రాష్ర్ట అభివృద్ధిపై క్లారిటీ రావడం లేదు. కేసు హైకోర్టులో పెండింగులో ఉండడంతో అటు వైసీసీ, ఇటు టీడీపీ ఇరకాటంలో పడినట్లు అవుతోంది. కృష్ణా నది వరదలకు అమరావతి మునిగిపోతుందనే సాకుతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చింది. దీంతో రైతుల నోట్లో మట్టి […]

Written By: Srinivas, Updated On : September 11, 2021 5:40 pm
Follow us on

AP Capital City: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు పలు మలుపులు తిరుగుతున్నాయి. కీలక నిర్ణయాలపై తీర్పులు వెలువడక మధ్యలోనే ఆగిపోయాయి. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం తీరును ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో రాష్ర్ట అభివృద్ధిపై క్లారిటీ రావడం లేదు. కేసు హైకోర్టులో పెండింగులో ఉండడంతో అటు వైసీసీ, ఇటు టీడీపీ ఇరకాటంలో పడినట్లు అవుతోంది. కృష్ణా నది వరదలకు అమరావతి మునిగిపోతుందనే సాకుతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చింది. దీంతో రైతుల నోట్లో మట్టి కొట్టింది.

టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అక్రమాలకు పాల్పడిందంటూ వైసీపీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైసీపీ చర్యలను టీడీపీ ఖండించినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో మూడు రాజధానుల ప్రస్తావనతో జగన్ ప్రభుత్వం ఇరుకున పడిపోయిందని తెలుస్తోంది. అధికార వికేంద్రీకరణతోనే రాష్ర్టం అభివృద్ధి సాధిస్తుందని వైసీపీ సర్కారు నమ్మడంతోనే ఈ ప్రస్తావన తీసుకువచ్చిందని తెలుస్తోంది.

2019 డిసెంబర్ లో జీఎస్ రావు కమిటీ తోపాటు బోస్టన్ గ్రూప్ మూడు రాజధానులపై నివేదిక అందజేసింది. దీంతో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించారు. మండలిలో ఆమోదం పొందకపోయినా అసెంబ్లీలో మాత్రం గవర్నర్ ఆమోదం పొందింది. కానీ ఈ విషయం కాస్త కోర్టుకు చేరడంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. మూడు రాజధానుల వ్యవహారంపై రాజకీయ పార్టీలతోపాటు రైతులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో విచారణ నవంబర్ కు వాయిదా పడింది.

అమరావతి విషయం తేలేందుకు రెండేళ్లు పడుతుందని తెలుస్తోంది. కేసు హైకోర్టు పరిధిలో ఉండడంతో నవంబర్ లో జరిగే విచారణ జరిగే అవకాశాలుండడంతో హైకోర్టులో తేలినా సుప్రింకోర్టులో పిటిషన్లు దాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల వరకు మూడు రాజధానుల వ్యవహారం కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నా ఫలితం ఏం వస్తుందోనని భావిస్తున్నారు. రాజధానుల వ్యవహారమే ఎజెండాగా ఎన్నికలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.