AP Cabinet Reshuffle 2022: దెబ్బ కొట్టి ఆయింట్ మెంట్ రాయడం అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు వైసీపీలోని మంత్రుల పరిస్థితిని చూస్తుంటే ఇదే గుర్తుకు వస్తోంది. ఎందుకంటే త్వరలోనే ఇప్పుడున్న మంత్రుల్లో చాలా వరకు మాజీలు కాబోతున్నారు. ఈ విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించారు. అయితే వారికి పార్టీలోని కీలక బాధ్యతలు అప్పటించనున్నారు జగన్.

మరి మంత్రి పదవులు పీకేసి పార్టీ కోసం పనిచేయండంటే చేస్తారా.. ఏదో పైకి తామంతా పదవుల కోసం పనిచేయట్లేదని, జగన్ ఏది చెబితే అదే చేస్తామంటూ చెబుతున్నారే తప్ప.. రాజకీయ నేతలు అంటేనే పదవుల కోసం ఆరాటపడే జీవులు అని మనందరికీ తెలిసిందే కదా. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూడగా వచ్చిన మంత్రి పదవిని కనీసం ఐదేండ్లు కూడా ఉంచకుండా పీకేస్తే ఎవరికి బాధగా ఉండదు చెప్పండి.
Also Read: Amaravati Capital Issue: అమరావతిపై మడత పేచీ.. వైసీపీ ప్రభుత్వం కొత్త పల్లవి
అయితే జగన్ లెక్కలు జగన్ కు ఉంటాయి. ఆయన 151మంది ఎమ్మెల్యేలకు ప్రతినిధి. వారందరినీ మెప్పించాలంటే అంత సులువు కాదు. కొందరిని నొప్పించి మరీ ఇతరులను ఒప్పించాల్సి వస్తుంది. అందుకే ముందే మంత్రుల మార్పు ఉంటుందని చెప్పి ఎవరినీ టార్గెట్ చేయట్లేదనే వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు.
కానీ ఎంత లేదన్నా మంత్రి పదవి తీసేస్తే సొంత జిల్లాలో అవమానంగా భావిస్తారు. పైగా తమ వర్గంలో చిన్నబోతారు కాబట్టి వారిని బుజ్జగించాలని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకే మాజీలు కాబోతున్న వారితో త్వరలోనే జగన్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో వారి మనసులో ఆవేదన ఏంటి.. పార్టీ కోసం ఎలాంటి బాధ్యతలను వారికి అప్పగించాలి, ఎలా ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలనే దానిపై వారితో చర్చించనున్నారు.

ఈ క్రమంలోనే వారిలోని అసంతృప్తిని చల్లార్చి తనవైపును ఉండే విధంగా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఇందులో కొందరికి పదవీ పరమైన హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ పదవులతో వారిని సంతృప్తి పరచాలని జగన్ భావిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే తమ జిల్లాలో ఇతరులకు మంత్రి పదవి ఇచ్చి తమది పీకేస్తే.. వారి ముందు చిన్నబోక తప్పదు. పైగా కొందరిని అలాగే కొనసాగిస్తారని ఇప్పటికే జగన్ చెప్పారు కాబట్టి.. ఈ విషయం కూడా వారిలో అగ్గి రాజేసే అవకాశం ఉంది. ఇతరులను ఉంచి తమదే ఎందుకు తీసేసినట్టు అనే డౌట్లు కూడా వారిలో వస్తాయి. మరి ఇన్ని అసంతృప్తులను కడుపులో దాచుకుని వారు పార్టీ కోసం ఏ మేరకు కష్టపడుతారో వేచి చూడాలి.
Also Read:pawan kalyan yatra for farmers : జనంలోకి జనసేనాని: రైతు ఓదార్పు యాత్రలో పవన్ కళ్యాణ్
[…] […]