Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Capital Issue: అమరావతిపై మడత పేచీ.. వైసీపీ ప్రభుత్వం కొత్త పల్లవి

Amaravati Capital Issue: అమరావతిపై మడత పేచీ.. వైసీపీ ప్రభుత్వం కొత్త పల్లవి

Amaravati Capital Issue:  ఆది నుంచి అమరావతి రాజధానిపై సుముఖంగా లేని వైసీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మడత పేచీ వేస్తోంది. అమరావతి రైతులు సుదీర్ఘ కాలం పోరాటబాట పట్టినా పట్టించుకోలేదు. విపక్ష నేతల డిమాండ్లను, విన్నపాలను సైతం పరిగణలోకి తీసుకోలేదు. ప్రజల్లో వ్యతిరేకత భావన వస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తొంది. చివరకు న్యాయస్థానం తప్పు పట్టి నిర్ణీత ఆరు నెలల వ్యవధిలో అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివ్రద్ధి చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతరు చేసింది.

Amaravati Capital Issue
Amaravati Capital Issue

కనీసం కోర్టు ఆదేశాలపై ఎటువంటి భయం, బెరుకు లేకుండా వ్యహరిస్తోంది. ఇప్పుడు రాజధాని ప్రాంతం అభివ్రద్ధి 6 నెలల్లో సాధ్యం కాదని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఇచ్చిన తీర్పులో పేర్కొన్న నిర్ణీత గడువును తొలగించాలని అభ్యర్థించింది. అలాకాని పక్షంలో కోర్టు నిర్దేశించిన 6 నెలల గడువును 5 ఏళ్లకు పెంచాలని కోరింది. రాజధాని నగరం, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏళ్ల సమయం పడుతుందని వివరించింది. అందువల్ల రాజధాని నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏకు అనుమతివ్వాలని విన్నవించింది. రాజధాని ప్రాంతం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపింది.

Also Read: Pawan Future CM RRR Writer Crazy Comments: పవన్ కాబోయే సీఎం.. ‘ఆర్ఆర్ఆర్’ రైటర్ క్రేజీ కామెంట్స్

అందువల్ల కాలం, నిధులు, అభివృద్ధి కోణంలో నిర్ణీత కాలంలో రాజధాని అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పడం సాధ్యంకాదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ఈ నేపథ్యంలో నిధుల లభ్యత, ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు ఉపయోగించుకొనే ముందు తీర్పు అమలులో ఉన్న సహేతుకమైన ఇబ్బందులు, అమలు సాధ్యం కాని పరిస్థితులను తెలియజేయడానికే అఫిడవిట్ దాఖలు చేసినట్టు ఆయన కోర్టుకు వివరించారు.

Amaravati Capital Issue
Y S Jagan

కేంద్రం నిధులివ్వడం లేదని సాకు
అయితే రాజధాని నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని వైసీపీ ప్రభుత్వం కొత్తగా షాకు చూపుతోంది. అమరావతి ప్రాంతంలో మిగతా పనులు పూర్తి చేసేందుకు రూ.42,231 కోట్టు అవసరమవుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదని వైసీపీ ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన రుణం సైతం సీఆర్డీఏకు దక్కడం లేదని ప్రభుత్వం చెప్పకొస్తోంది. దీనిపై రాజధాని నేతలు, ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నారు. వాస్తవానికి అమరావతి రాజధానికి మద్దతుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ, జనసేన, వామపక్షాలు, ప్రజా సంఘాలు నిలుస్తున్నా.. ఈ పార్టీలన్నీ ఏకతాటిపైకి రాకపోవడం అధికార వైసీపీ కలిసివస్తోంది. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రాకపోవడంతో వైసీపీ ప్రభుత్వం మొండిగా ముందుకు సాగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవైపు విపక్షాలు, మరో వైపు కోర్టులు అమరావతి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతుండడం అనుమనాలకు తావిస్తోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉండడం వల్లే వైసీపీ ప్రభుత్వం రెచ్చిపోతుందన్న అనుమానాలూ ఉన్నాయి. అయితే రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం తాము అమరావతికే మద్దతు ఇస్తున్నామని.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మాత్రమే చాలా ఏళ్ల నుంచి కోరుతున్నామని గుర్తు చేస్తున్నారు. మూడు రాజధానులకు తమ అధిష్టానం ఒప్పుకోదని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని..సరైన సమయంలో రోడ్డు మ్యాప్ ద్వారా సీఎం జగన్ దురాగతాలను ఎండగడదామని చెబుతున్నారు.

కాలయాపన కోసమే తపన
వైసీపీ ప్రభుత్వం కోర్టులకు తప్పుడు సమాచారమందించి కాలయాపన చేయడం ద్వారా రాజధాని విషయంలో తమ మాట నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న వాదన వినిపిస్తోంది. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. అమరావతి ప్రాంత అభివ్రద్ధికి కనీసం ఐదేళ్ల గడువు కోరడం ద్వారా ప్రభుత్వం తన చతురతను ప్రదర్శించింది. చట్టంలో ఉన్న వెసులబాటుల ద్వారా అమరావతిపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. ఈ మూడేళ్లలో చేయలేని పనులు..గడువు ఇచ్చినా చేస్తుందనడంలో అనేక సందేహాలున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి మరో రెండేళ్ల గడువు మాత్రమే ఉంది. చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం. ఏమైనా చేయాలంటే ఈ ఏడాదే చేయాలి. కానీ అమరావతి అంటేనే ప్రభుత్వ పెద్దలకు గిట్టడం లేదు. పైగా ఆర్థిక ఇబ్బందులు సైతం ఉన్నాయి. సంక్షేమ పథకాలను అమలుచేయడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రజలకు తాయిలాలు పంచి ఓట్లుగా మలుచుకునే పనిలో పడ్డారు. వేలాది కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం కంటే సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా భావిస్తున్నారు. అందుకే అమరావతిని తొక్కేసే పనిలో పడ్డారు.

Also Read: pawan kalyan yatra for farmers : జనంలోకి జనసేనాని: రైతు ఓదార్పు యాత్రలో పవన్ కళ్యాణ్

RELATED ARTICLES

Most Popular