AP New Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై జగన్ ముందుకెళ్తుంటే పదవులు కోల్పోయిన వారు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. మొదట తాము రాజీనామాలు చేసినా పార్టీ వెంట ఉంటామని భరోసా ఇచ్చినా ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. తమకు మంత్రి పదవులు దక్కకపోతే పార్టీ మారేందుకు కూడా సిద్ధమే అని హింటు ఇస్తున్నారు. దీనిపై జగన్ కూడా తల పట్టుకుంటున్నారు. ఎందుకో మంత్రివర్గ విస్తరణ తేనెతుట్టెను కదిపానని తెగ ఇదైపోతున్నారు.

ఇప్పటికే కొందరు టీడీపీ నేతలతో బేరసారాలకు దిగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే రాబోయే ఎన్నికల్లో జగన్ కు కష్టాలు తప్పవనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ అనవసరంగా చేపట్టినట్లు జగన్ బాధ పడుతున్నారు. మంత్రుల్లో ఇంతటి అసంతృప్తికి కారణాలేవైనా పార్టీని వీడేందుకు కూడా వెనకాడటం లేదని చెబుతున్నారు. కేబినెట్ ప్రక్షాళనలో చోటు దక్కకపోతే దేనికైనా రెడీ అని బెదిరిస్తున్నారు.
దీంతో వీరి కోపాన్ని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. అందుకే వారిపై వల విసిరేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేసినా ఫలితం మాత్రం ఇదేనా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. అందుకే పార్టీ మారేందుకు కూడా వెనుకాడటం లేదు. అందరితో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నా వారికి పదవులపైనే ధ్యాస ఉన్నట్లు కనిపిస్తోంది. తమకు పదవులు దక్కితేనే ఉంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో జగన్ కు అర్థం కావడం లేదు.

అధిష్టానం నిర్ణయంతో పదవులు కోల్పోయిన వారిలో ఆగ్రహాలు పెల్లిబుకుతున్నాయి. కేబినెట్ లో బెర్త్ ఖాయం కాకపోతే భవిష్యత్ పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు. అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరితే రాబోయే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. వైసీపీ మరోసారి అధికారం చేపట్టాలంటే మంత్రులు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
[…] […]
[…] Hindi Controversy: దేశంలో హిందీ భాషపై మరోమారు విమర్శలు వస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ జాతీయ భాషగా ప్రకటించలని చూస్తున్న తరుణంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తోంది. ఏ రాష్ర్టంలో అయినా అక్కడి ప్రాంతీయ భాష ఉండటంతో హిందీని ఎలా జాతీయ భాషగా ఎంచుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. అమిత్ షా చేసిన ప్రకటనతో రాజకీయ దుమారం రేగుతోంది. దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందీ ఆంగ్లానికి ప్రత్యామ్నాయం కాదని చెబుతున్నారు. […]