New Districts And Revenue Divisions: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లాలకు కలెక్టర్లను కూడా నియమించింది ప్రభుత్వం. మొత్తం 26 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్, శ్రీకాకుళం శ్రీకేశ్ బాలాజీ రావు, విజయనగరం సూర్యకుమారి, మన్యం నిశాంత్ కుమార్, విశాఖపట్నం మల్లికార్జున, అనకాపల్లి రవి సుభాష్, కాకినాడ కృతికా శుక్లా, తూర్పుగోదావరి మాధవీలత, కోనసీమ హిమాన్షు శుక్లా, పశ్చిమగోదావరి ప్రశాంత్, ఏలూరు ప్రసన్న వెంకటేశ్, కృష్ణా రంజిత్ బాషా, ఎన్టీఆర్ ఎస్. దిల్లీరావు, గుంటూరు వేణుగోపాల్ రెడ్డి, పల్నాడు శివశంకర్, బాపట్ల విజయ, ప్రకాశం దినేష్ కుమార్లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై వర్చువల్ గా భేటీ అయిన కేబినెట్ చిన్న మార్పులకు శ్రీకారం చుడుతోంది. నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త జిల్లాల ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
26 జిల్లాలు 73 రెవెన్యూ డివిజన్లతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారనున్నాయి. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రభుత్వం నూతన జిల్లాల కోసం కొన్ని మార్పులు చేసినా చివరకు ఒక రూపుకు మాత్రం ఓకే చెప్పింది. దీంతో కొత్త జిల్లాల్లో పనులు నిర్వహించేందుకు పకడ్బందీగా తయారు అయింది.

కొత్త జిల్లాలకు భవనాలు సమకూర్చారు. అందులో అరకొర వసతులున్నా ప్రస్తుతం సర్దుకుపోవాలని చూస్తోంది. మెల్లమెల్లగా వసతుల కల్పనకు చర్యలు తీసుకునేందుకు నిర్ణయించుకుంది. అందుకే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ముమ్మరంగా పనులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 4నుంచి పనులు శరవేగంగా జరిపేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. పాత డివిజన్లలో పనులు అలాగే కొనసాగుతుండగా కొత్త వాటిలో పనులు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
Also Read:AP New Districts: కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రక్రియ ప్రారంభమేనా?
[…] Movement of Maoists: రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలవుతున్నాయి. 15 రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి నక్సలైట్లు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు. గతంలో పార్టీలో పనిచేసి లొంగిపోయిన నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశం వార్తలను పోలీసులు కొట్టి పడేసినప్పటికీ.. ఇంటలిజెన్స్ నివేదిక మాత్రం జనశక్తి సమావేశం నిజమే అని నిర్ధారించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మాజీలను పిలిపించుకుని కౌన్సెలింగ్ పేరిట వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మావోయిస్టులు సమావేశం కావడానికి కారణమైన జనశక్తి నేతను కూడా అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం కావడం.. ఆయన తరచూ జిల్లా పర్యటనకు వస్తుండడంతో ప్రభుత్వం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. మళ్లీ మొగ్గతొడుగుతున్న జనశక్తి పార్టీని ఆదిలోనే అంతం చేసే ప్రణాళిక రూపొందించింది. […]
[…] Young Hero Arrested Rave Party: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ వార్తలు సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన రేవ్ పార్టీలో సెలబ్రిటీల పిల్లలు దొరికడం హాట్ టాపిక్ గా మారింది. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో చాలామంది సినీ సెలబ్రిటీలు ఉండటంతో పాటు.. వీరంతా డ్రగ్స్ వాడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 150 మందిని పట్టుకున్నారు పోలీసులు. […]