AP BJP: ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఏపీలో రాజకీయాలు గరం గరంగా మారాయి. మళ్లీ అధికారంలలోకి వచ్చేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయం తామే అన్నట్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. జన సేనాని పవన్ కళ్యాణ్‌తో 20 నిమిషాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై బీజేపీ సీరియస్ దృష్టిపట్టింది. మోదీ పర్యటన తర్వాత ఏపీ నుంచే బీజేపీ అధికార సూర్యోదయాన్ని కమలం పార్టీ చూస్తోంది అని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. మోదీ ఇచ్చిన బూస్ట్‌తో ఏపీలో రెండు బలమైన పార్టీలను దశల వారీగా నిర్వీర్యం చేయడం తమకు మిత్రుడిగా ఉన్న మూడో ప్రాంతీయ పార్టీని బలోపేతం చేయడం, తాము అన్నింటికన్నా బలంగా మారడం అనే వ్యూహంతో ఏపీ బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. మరో ఐదేళ్లు తిరిగేనాటికి ఏపీలో అధికారంలోకి వచ్చి సుదీర్ఘకాలం ఏలాలని భావిస్తోంది బీజేపీ.

పక్కా మాస్టర్ ప్లాన్‌తో అడుగులు..
త్రిముఖ వ్యూహంలో భాగంగానే మొదటి దెబ్బ తెలుగుదేశానికి పడుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, ఈజేపీ నాయకులు. ఈ క్రమంలోనే జనసేనను తమ వైపునకు తిప్పుకుంటోందని అభిప్రాయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి జనసేన సాయం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక గేమ్‌ప్లాన్‌లో భాగంగా జనసేనను బీజేపీ శక్తి కొలదీ బలోపేతం చేస్తుంది. తాను కూడా పటిష్టంగా తయారవుతుంది.
ఈ క్రమంలో ఏపీలో టీడీపీని వెనక్కి నెట్టేసి జనసేనను ముందుకు తేవాలి. ఆ విధంగా జనసేన ఎంతలా దూకుడు ప్రదర్శిస్తే అంతలా వైసీపీకి ఆ పార్టీ టార్గెట్ అవుతుంది. అపుడు జనసేనకు వైసీపీ తొలి ప్రయారిటీ ఇచ్చి విమర్శల దాడిని పెంచుతుంది. ఆటోమేటిక్ గా టీడీపీ ప్లేస్ తగ్గిపోయి.. జనసేన,, బీజేపీ ఆప్లేస్‌లోకి వస్తాయని కమళనాథులు భావిస్తున్నారు.
మోదీ యాక్షన్ ప్లాన్..
ఈ త్రిముఖ వ్యూహాన్నికి నరేంద్ర మోదీ విశాఖ టూర్‌లో తన దగ్గరకు పిలిపించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చెప్పారని అంటున్నారు. నిజానికి బీజేపీ అంతిమ లక్ష్యం వేరుగా ఉంటుంది. ఏపీలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా ప్రాంతీయ పార్టీలు లేకుండా సోలోగా బీజేపీ ఏలాలనే. దానికి ముందుగా ఒక్కో ప్రాంతీయ పార్టీని ఎలిమినేట్ చేయాలని చూస్తోంది. ఆ విధంగా చూస్తే ఏపీలో ఇపుడు తెలుగుదేశం పార్టీ బీజేపీకి చిక్కింది. నిజానికి నరేంద్ర మోడీ అమిత్‌షాలకు చంద్రబాబు మీద కోపం. తమను అనరాని మాటలతో అవమానించారని, తిరుపతికి వచ్చిన షాను అడ్డుకునే ప్రయత్నం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చేయించారు. అందుకే టీడీపీతో జట్టుకట్టేందుకు బీజేపీ ఆసక్తి చూపడం లేదని చాలా మంది అంటున్నారు.
బీజేపీ అసలు వ్యూహం వేరు..
అయితే అందరూ అనుకుంటున్నది వాస్తవం కాదు రాజకీయాల్లో శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఆ విధంగా ఈ విషయం బీజేపీకి తెలియంది కాదు. కానీ ఆ పార్టీ ఏపీలో తన రాజకీయ అవకాశాలను పెంచుకోవాలని చూస్తోంది. 2014 నుంచే ఆ ప్రయత్నాలలో ఉంది. దాని ఫలితమే టీడీపీతో తప్పనిసరి పరిస్థితులలో దోస్తీ చేసినా 2019 నాటికి వైసీపీకి ఊతమిచ్చి ఆ పార్టీని సైడ్ చేసింది. ఈ క్రమంలోనే 2024లో టీడీపీని కనుమరుగు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఉనికిలో లేకుండా చేయాలని చూస్తోంది. టీడీపీ ఎంతలా పతనం అయితే అంతలా బీజేపీ బలపడుతుందన్న ఆలోచనలో కమలం పార్టీ ఉంది.
టీడీపీ ఆర్థిక వనరులపై దెబ్బ..
టీడీపీని 2024 ఎన్నికల్లో ఒంటరి చేయాలని చూస్తున్న బీజేపీ టీడీపీ ఆర్ధిక వనరుల మీద కూడా దెబ్బ తీయాలని చూస్తుంది. అదే సమయంలో జనసేనకు జవసత్వాలు కూడా అందిస్తోంది. ఆ విధంగా పవన్ గ్లామర్ బీజేపీ వ్యూహాలతో 2024 నాటికి టీడీపీని నెట్టి ప్రధాన ప్రతిపక్షం సీట్లోకి ఈ రెండు పార్టీలు రావాలన్నది బీజేపీ ప్లాన్. ఆ మీదట ఓడిన టీడీపీ మరింతగా పతనం అవుతుంది. అపుడు అందులో ఉన్నవారు అంతా కూడా బీజేపీలోకే వచ్చి చేరుతారు. జాతీయ స్థాయిలో బలమైన పార్టీ కాబట్టి బీజేపీకి లాభిస్తుంది.

2024లో బీజేపీ ఓడితే కనుమరుగే..
ఇక చంద్రబాబు ఇప్పటికే ఏడు పదుల వయసు దాటి ఉన్నారు. ఆయన కనుక 2024 ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని పూర్తి సామర్ధ్యంతో నడిపించలేరు. బాబు తరువాత అంతటి దీక్షాదక్ష్యుడు టీడీపీలో ఎవరూ లేరు. దీంతో టీడీపీ ప్రాభవం తగ్గుతుంది.. అది తమకు ఉపకరిస్తుంది అని బీజేపీ ఆలోచన. ఇక 2024 నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే 2029 నాటికి ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని కమలనాథులు భావిస్తున్నారు. ఈమేరకే బీజేపీ ఈ త్రిముఖ వ్యూహాన్ని రూపకల్పన చేసిందని సమాచారం. మరి ఈ వ్యూహం ఏపీలో ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి