Bigg Boss 6 Telugu- Sri Satya Mother: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్ కు ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది..అలాంటి కంటెస్టెంట్స్ లో శ్రీ సత్య కూడా ఒకరు..సంతోషంగా జీవితం గడుపుతున్న వీళ్ళ కుటుంబంలో అకస్మాత్తుగా యాక్సిడెంట్ ద్వారా శ్రీ సత్య తల్లికి కాళ్ళుపోవడంతో ఆమె తండ్రి అన్ని సేవలు చేసుకుంటూ వస్తున్నాడు.. ఇంట్లో సంపాదించేది శ్రీ సత్య ఒక్కటే కాబట్టి కుటుంబం మొత్తం ఆమె మీదనే ఆధారపడడంతో చిన్న వయస్సు నుండే సంపాదించడం ప్రారంభించింది..

అలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె సీరియల్స్ మరియు షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ యూత్ లో బాగా ఫేమస్ అయిపోయింది..అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శ్రీ సత్య ఇప్పుడు హౌస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతూ ఇన్ని వారాలు నెట్టుకొచ్చింది..ఇక ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీకెండ్ అవ్వడంతో శ్రీ సత్య తల్లిదండ్రులు ఈరోజు ఎపిసోడ్ లో అడుగుపెట్టారు.
వీల్ చైర్ లో కూర్చున్న శ్రీ సత్య తల్లిని తోసుకుంటూ హౌస్ లోకి అడుగుపెడతాడు ఆమె తండ్రి.. చాలా కాలం తర్వాత తన తల్లిదండ్రులను చూసి శ్రీసత్య బాగా ఎమోషనల్ అయిపోతుంది.. ఆమె చేతుల మీదుగా ముద్దలు కలిపి తన తల్లికి తినిపిస్తుంది.. చాలా ఎమోషనల్ గా అనిపిస్తున్న ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..

ఆ తర్వాత అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్న సమయం లో శ్రీ సత్య.. రేవంత్ గురించి చెప్తూ ‘ఫస్ట్ వీక్ లో ఏమని చెప్పి నన్ను నామినేషన్ వేశాడో తెలుసా డాడీ.. మనం బాగా మాట్లాడుకుంటున్నాము కానీ కనెక్షన్ కుదరడం లేదని నామినెటే చేసాడు’ అని చెప్తుంది..అప్పుడు శ్రీ సత్య నాన్న మాట్లాడుతూ ‘నువ్వు కూడా పిచ్చి పిచ్చి నామినేషన్స్ బాగా వేశావు’ అంటాడు..అలా కాసేపు ఫన్ కాసేపు ఎమోషన్స్ తో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ గడిచిపోయింది.
