అంతా ఏకపక్షమే..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. ఏ అంశం మీద మాట్లాడినా వైసీపీ సభ్యులు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తప్పులు ఎత్తి చూపుతున్నా… విమర్శలు చేస్తున్నా అడ్డుకుంటున్నారు. చేసేది లేక వాళ్లు నిరసనకు దిగుతున్నారు. దీంతో సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన తీర్మానం చేయడం.. స్పీకర్‌‌ సస్పెండ్‌ చేయడం చకాచకా జరగిపోతున్నాయి. వరుగా నాలుగో రోజు కూడా ఇదే సీన్‌ రిపీట్‌ కావడం గమనార్హం. Also Read: నిరుద్యోగులకు […]

Written By: Srinivas, Updated On : December 4, 2020 10:48 am
Follow us on


ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. ఏ అంశం మీద మాట్లాడినా వైసీపీ సభ్యులు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తప్పులు ఎత్తి చూపుతున్నా… విమర్శలు చేస్తున్నా అడ్డుకుంటున్నారు. చేసేది లేక వాళ్లు నిరసనకు దిగుతున్నారు. దీంతో సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన తీర్మానం చేయడం.. స్పీకర్‌‌ సస్పెండ్‌ చేయడం చకాచకా జరగిపోతున్నాయి. వరుగా నాలుగో రోజు కూడా ఇదే సీన్‌ రిపీట్‌ కావడం గమనార్హం.

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు..!

ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపే వారే టార్గెట్‌

ముఖ్యంగా సర్కారు తప్పులు ఎత్తిచూపుతున్న టీడీపీ సభ్యులను వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్‌ చేస్తున్నారు. వాళ్లు మాట్లాడేటప్పుడు పదేపదే అడ్డుతగులుతున్నారు. ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్న నిమ్మల రామానాయుడుపైకి గురువారం వైసీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. ఆయనకు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు రక్షణగా నిలబడాల్సి వచ్చింది.

సస్పెన్షన్‌ కామన్ అయిపోయింది

మొదటి రోజు నుంచి ఏదో ఓ సందర్భంలో టీడీపీ సభ్యుల్ని బయటకు పంపుతూనే ఉన్నారు. ఆ తర్వాత చర్చలు జరిపి బిల్లులు పాస్ చేస్తున్నారు. గురువారం రాష్ట్రంలో అమూల్ మిల్క్ ప్రాజెక్ట్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టగా.. స్పీకర్‌‌ అవకాశం ఇవ్వలేదు. దీంతో పోడియాన్ని చుట్టుముట్టారు. ఎవరి సీట్లో వాళ్లు కూర్చోవాలని చెప్పినా.. వివనకపోవడతో చివరికి సస్పెండ్ చేశారు.

Also Read: మెగాస్టార్‌‌ రాజకీయాల్లో ఉంటే… పవన్ సంచలన వ్యాఖ్యలు

అవకాశమే ఇవ్వడం లేదు…

ప్రభుత్వం దూకుడుగా మాట్లాడుతున్న సభ్యులకు అసలు అవకాశమే ఇవ్వడం లేదు. అతి కష్టం మీద ఎవరికైనా ఇచ్చినా.. వైసీపీ సభ్యులు మాటి మాటికి కలుగచేసుకుంటున్నారు. స్పీకర్ కూడా.. ప్రతిపక్షం మాట్లాడుతున్న సమయంలో.. అధికార పక్షం నుంచి ఎవరు అడిగినా మైక్‌ ఇస్తున్నారు. సాధారణంగా స్పీకర్ స్థానంలో ఉన్న ప్రభుత్వం ప్రకటన చేస్తున్నప్పుడు.. స్పందించడానికి తప్పులు చెప్పడానికి.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలకు ఎక్కువ చాన్సిస్తారు. కానీ, ఏపీ అసెంబ్లీ కదా.. అంతా వేరుగా ఉంటుంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్