దేశంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రజల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి సమయంలో చాలామంది తమ దగ్గర ఉన్న కొంత డబ్బును బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. డిపాజిట్లపై ఎక్కువ మొత్తంలో వడ్డీ ఇచ్చే బ్యాంకుల కొరకు అన్వేషిస్తున్నారు.
Also Read: తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులయ్యే ఛాన్స్.. ఎలా అంటే..?
కరోనా విజృంభణ వల్ల చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గతంతో పోలిస్తే వడ్డీరేట్లను భారీగా తగ్గించేశాయి. అయితే ఒక బ్యాంకు మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచి కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. దేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లను ఏకంగా 0.2 శాతం పెంచింది. పెంచింది తక్కువ మొత్తమే కరోనా కాలంలో ఈ పెంపు వినియోగదారులకు మేలు చేస్తుందనే చెప్పవచ్చు.
Also Read: వాట్సాప్ పేమెంట్స్ చేస్తున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..?
ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంక్ తీసుకున్న నిర్ణయం వల్ల బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. కెనరా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజట్లపై వడ్డీ రేట్లను పెంచడం వల్ల రెండు నుంచి మూడు సంవత్సరాల కాలపరిమితికి 5.2 శాతంగా ఉన్న వడ్డీరేటు ఏకంగా 5.4 శాతానికి చేరింది. పెరిగిన వడ్డీ రేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయని కెనరా బ్యాంక్ ప్రతినిధులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: జనరల్
కెనరా బ్యాంక్ పదేళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచింది. గతంలో వడ్డీ రేటు 5.3 శాతంగా ఉండగా బ్యాంక్ ఆ వడ్డీ రేటును 5.3 శాతం నుంచి ఏకంగా 5.5 శాతానికి పెంచడం గమనార్హం. సీనియర్ సిటిజన్లకు మాత్రం సాధారణంగా వచ్చే వడ్డీతో పోలిస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుంది.