ఫిబ్రవరిలోనే ఏపీ స్థానిక ఎన్నికలు

ఏపీలో స్థానిక ఎన్నికల్లో ఫిబ్రవరిలో నిర్వహించనున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలన్న వైసీపీ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, ఇందుకు రాష్ట్ర సర్కారు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధమవుతోంది. Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు..! సీన్‌ రివర్స్‌ వాస్తవానికి […]

Written By: Srinivas, Updated On : December 4, 2020 10:57 am
Follow us on


ఏపీలో స్థానిక ఎన్నికల్లో ఫిబ్రవరిలో నిర్వహించనున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలన్న వైసీపీ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, ఇందుకు రాష్ట్ర సర్కారు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధమవుతోంది.

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు..!

సీన్‌ రివర్స్‌

వాస్తవానికి ఏపీ సర్కారు కరోనా టైంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ కరోనా టైంలో వద్దంటూ వాయిదా వేశారు. దీనిపై అప్పట్లో వైసీపీ తీవ్రంగా మండిపడ్డ విషయం తెలిసిందే. కానీ, అదే వైసీపీ మళ్లీ కరోనా పేరుతోనే ఎన్నికల వాయిదా కోరుతోంది. ఇందులోభాగంగానే ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన రాజకీయ పార్టీల భేటీకి కూడా హాజరు కాలేదు. అంతేకాదు నిమ్మగడ్డ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించకుండా అడ్డుపడింది.

మంత్రులు, సీఎస్‌ల ప్రకటనలు

కరోనా సమయంలో ఎన్నికలేంటని మంత్రులు, సీఎస్‌ సహా వైసీపీ నేతలంతా ప్రకటనలు చేశారు. తమకు ప్రజారోగ్యమే ముఖ్యమని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. చెప్పినట్లే కరోనా టైంలో ఎన్నికలు వద్దంటూ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది.

Also Read: మెగాస్టార్‌‌ రాజకీయాల్లో ఉంటే… పవన్ సంచలన వ్యాఖ్యలు

చెల్లని వైసీపీ సర్కారు వాదన

హైకోర్టులో వైసీపీ సర్కారు వాదన చెల్లలేదు. కరోనా టైంలో ఎన్నికలు వద్దంటూ ఏజీ వినిపించిన వాదనలను కోర్టు సమర్ధించలేదు. ఎస్‌ఈసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, నిబంధనల మేరకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అధికారం ఉందని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్