ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళైంది. శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. కరోనా కల్లోలంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిన వేళ.. సమస్యలు చుట్టుముట్టిన తరుణంలో అధికార వైసీపీ ఈసారి అసెంబ్లీ సమావేశాలను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. ఈసారి అసెంబ్లీని 3 రాజధానుల అంశం, స్థానిక సంస్థల ఎన్నికలు, అంతర్వేది ఘటన లాంటి అంశాలు కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో వాడివేడిగా వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: జగన్ కు కేంద్రం షాక్: దోస్తీ అంటూనే ఫుట్ బాల్ ఆడేస్తున్నారు
ఈనెల 30వ తేది సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. డిసెంబర్ 5 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు గవర్నర్ పేరిట నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నిరోజులు జరపాలనే అంశాన్ని సోమవారం జరుగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు.ఈసారి శీతాకాల సమావేశాల్లో 11 చట్టాల్లో సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక 3 కీలక బిల్లులు ఆమోదించుకోవాలని చూస్తోంది.
ఇక కరోనా వేళ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే అంశాన్ని టీడీపీ భుజానికెత్తుకుంది. ఆ అంశాన్ని కూడా పార్టీ సభలో ప్రస్తావించి చర్చకు పట్టుబడట్టే అవకాశాలున్నాయి. అయితే కరోనా కారణంగా అసెంబ్లీ పనిదినాలను తగ్గించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
Also Read: జగన్ అక్రమ ఆస్తుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసారి అసెంబ్లీ హోరెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తరుఫున మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్