https://oktelugu.com/

NTR- Inter Exams: ఇంటర్ ఎగ్జామ్స్‌ లో జూ. ఎన్టీఆర్‌ పై ప్రశ్న.. కారణం అదే !

NTR- Inter Exams: ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్‌ లో ‘జూనియర్ ఎన్టీఆర్‌’పై ఓ ప్రశ్న రావడం నిజంగా విశేషమే. ప్రజెంట్ ఫామ్ లో ఉన్న హీరో పై ఇలా ఒక ప్రశ్న అడగడం ఇదే తొలిసారి. అందుకే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌ లో ఎన్టీఆర్ పై ప్రశ్న వచ్చింది. ఈ క్వశ్చన్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌ గా మారాయి. […]

Written By:
  • Shiva
  • , Updated On : May 10, 2022 / 06:21 PM IST
    Follow us on

    NTR- Inter Exams: ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్‌ లో ‘జూనియర్ ఎన్టీఆర్‌’పై ఓ ప్రశ్న రావడం నిజంగా విశేషమే. ప్రజెంట్ ఫామ్ లో ఉన్న హీరో పై ఇలా ఒక ప్రశ్న అడగడం ఇదే తొలిసారి. అందుకే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌ లో ఎన్టీఆర్ పై ప్రశ్న వచ్చింది. ఈ క్వశ్చన్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌ గా మారాయి.

    Inter Exam paper

    ఇంతకీ ప్రశ్న ఏమిటంటే.. ‘ఆర్ఆర్ఆర్ చిత్రంలో ‘కొమరమ్ భీమ్’ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌ తో.. మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు అడిగి.. సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయండి’ అంటూ ప్రశ్నగా ఇచ్చారు. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఈ క్వశ్చన్ పేపర్‌ ను వైరల్ చేయడానికి తెగ పోటీ పడుతున్నారు.

    Also Read: Vijayendra Prasad: ‘మహేష్ – రాజమౌళి’ పై విజయేంద్రప్రసాద్ క్రేజీ కామెంట్స్

    అసలు ఇలా ఒక ఫైనల్ ఎగ్జామ్‌ లో ఎన్టీఆర్ పై ఒక క్వశ్చన్ రావడం వెనుక కారణం ఏమిటి ? కేవలం, తెలంగాణ వీరుడు ‘కొమరమ్ భీమ్’ పాత్రలో ఎన్టీఆర్ నటించడమే ప్రధాన కారణం. కానీ, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ ప్రశ్నాపత్రాన్ని ట్వీట్ చేస్తూ… ఇది ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం, మరియు దటీజ్ పవర్ ఆఫ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటూ కామెంట్లు పెడుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

    NTR

    వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర విషయంలో కొన్ని చోట్ల ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. కానీ, ఎన్టీఆర్ తన నటనతో అబ్బురపరిచాడు. ఎన్టీఆర్‌ తో పోటీ పడే నటుడే లేడు అన్నట్టు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తారక్ నటన అద్భుతంగా ఉంది. ఫలితంగా ఎన్టీఆర్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. తెలుగులో కంటే కూడా.. నార్త్ లో తారక్ కి మంచి పేరు వచ్చింది.

    ఎన్టీఆర్ ఇంత గొప్ప నటుడా అంటూ బాలీవుడ్‌ సైతం ఆశ్చర్యపోయింది. ఎన్టీఆర్ నటనకు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. దాంతో ఉత్తరాదిలో ఎన్టీఆర్ కు మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేయాలని హిందీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

    Also Read:Crazy News: బాబోయ్.. ఇదెక్కడ దరిద్రం ? ప్రభాస్ కాస్త చెప్పవయ్యా

    Tags