AP SSC Exams Postponed: ఆంధ్రప్రదేశ్ లో మరోమారు పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలున్నాయి. మే 2 నుంచి నిర్వహించేందుకు మొదట షెడ్యూల్ ప్రకటించినా ప్రస్తుతం తొమ్మిదో తేదీకి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షల్లో మార్పులు చోటుచేసుకోవడంతో ఆ ప్రభావం పదో తరగతి పరీక్షల మీద పడుతోంది. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీంతో పరీక్షల నిర్వహణపై సందిగ్దం నెలకొంది.
పదోతరగతి, ఇంటర్ పరీక్షలు ఒకేసారి నిర్వహించడం వీలు కానందున వాయిదా వేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా మార్పులు చేసి తరువాత షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే షెడ్యూల్ తేదీలు మార్చేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వం ఓకే చేస్తే ఎప్పుడనేది త్వరలో తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
Also Read: కొడాలి నానిని కొనసాగిస్తారా? మంత్రి పదవి ఉంటుందా? అడ్డంకులివే
గత రెండేళ్లుగా కరోనా కారణంగా పరీక్షల నిర్వహణ లేకపోగా ప్రమోట్ చేస్తూ విద్యార్థులను పై తరగతులకు పంపిస్తున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం రెడీ అయినా రెండు పరీక్షలు నిర్వహించడం కష్టసాధ్యమయ్యే సూచనలుండటంతో అధికార యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశిస్తే కొత్త షెడ్యూల్ ప్రకారం జరిపేందుకు చర్యలు తీసుకోనుంది. దీని కోసం సోమవారం సవరించిన షెడ్యూల్ ను విడుదల చేసేందుకు అంగీకరించింది. అధికారులు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. పరీక్షల తేదీలు ఖరారు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ అనుమతితో పరీక్షల షెడ్యూల్ ను మార్చి మరోసారి బయటకు తీసుకొచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం.
Also Read: కేసీఆర్ సార్ ప్రకటన అయిపాయే.. నోటిఫికేషన్లు ఎప్పుడు సార్?