Aginpath Protest: తెలంగాణ పేరు చెప్పగానే దేశంలోనే నంబర్ 1 పోలీసింగ్ వ్యవస్థ పేరు ఇట్టే గుర్తుకు వస్తుంది. దిశా , నయీం ఎన్ కౌంటర్ నుంచి నేరాల అదుపు వరకూ తెలంగాణ పోలీసులకు మంచి పేరుంది. సైబర్ నేరాల కట్టడిలోనే దేశంలోనే నంబర్ 1గా నిలుస్తున్నారు. ఇదంతా కేసీఆర్ పోలీసులకు అత్యాధునిక వాహనాలు అందించడం.. ఆధునిక వసతులు కల్పించడం.. వేలాదిమందిని రిక్రూట్ చేయడంతో ప్రస్తుతం పటిష్టంగా తయారైంది.
ఎక్కడ ఏ నేరం జరిగినా ముందే అరికట్టే పోలీసులు తెలంగాణలో రెండు రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో చేష్టలుడిగి చూస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం నిస్తేజంగా మారారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ గత రెండు రోజులుగా అట్టుడుకిపోయింది. ఈ రెండూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలే కావడం విశేషం. ఆ రెండింటిలోనూ తెలంగాణ పోలీసులు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో విధ్వంసాలు, బస్సులు, రైళ్ల ముట్టడి జరిగింది. మొదటి రోజు బీజేపీ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి నిర్వహించగా దాన్ని తెలంగాణ పోలీసులు అడ్డుకోలేకపోయారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంతముందు టీఆర్ఎస్ పై నిరసన చేస్తే జిల్లాలు, వారి ఇల్లు దాటనివ్వని పోలీసులు ఇప్పుడు హైదరాబాద్ లో వీరంగం సృష్టించినా.. ఆఖరుకు రేణుకా చౌదరి, భట్టి లాంటి వారు పోలీసుల చొక్కా పట్టుకున్నా పెద్దగా స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక ఈరోజు సికింద్రాబాద్ లో బీజేపీకి ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా ఉద్యమించిన యువకులను తెలంగాణ పోలీసులు అడ్డుకోకపోవడం గమనార్హం. ఇప్పటికీ పట్టాలపై అంతటి విధ్వంసం జరిగి దేశవ్యాప్తంగా సంచలనమైనా కూడా తెలంగాణ సర్కార్ ఈ దమనకాండను సరిగ్గా అడ్డుకోలేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఇంత భారీగా ఆర్మీ ఉద్యోగులు హైదరాబాద్ వచ్చినా తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోవడం అంరదినీ ఆశ్చర్యపరిచింది. చివరకు విధ్వంసం ప్రారంభమైన చాలా సేపటికి పోలీసులు బలగాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ రెండు వ్యవహారాల్లో పోరాడింది బీజేపీపైనే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. బీజేపీని అభాసుపాలు చేసే.. బీజేపీకి మైనస్ అయ్యే ఘటనలే.. అందుకే ఈ విషయంలో కేసీఆర్ కానీ.. కేటీఆర్ కానీ చొరవ తీసుకోలేదు. పైగా ఆందోళన చేస్తున్న యువతకు మద్దతుగా బీజేపీని ఏకిపారేస్తూ కేటీఆర్ ట్వీట్ చేయడం ఈ అనుమానాలకు కారణమైంది. తెలంగాణ ప్రభుత్వం కావాలనే యువత ఆందోళన విషయంలో మిన్నకుండిపోయిందా? బీజేపీపై వ్యతిరేకతను ఇలా పురిగొల్పిందా? అన్న అనుమానాలకు ఈ రెండు ఘటనలు ఉదాహరణగా చెప్పొచ్చు..
https://twitter.com/KTRTRS/status/1537756141853102082?s=20&t=juwPXqxm8m86YUcHCtb9fw
We understand your pain brothers.
Please immediately go to Governor @DrTamilisaiGuv Darbar, she will tell her @narendramodi ji to take back #Agnipath #AgnipathScheme @KTRTRS pic.twitter.com/haYVb90DXm— krishanKTRS (@krishanKTRS) June 17, 2022