అసలు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయ రథం ఆహుతి వెనుక ఏం జరిగింది..? దురదృష్టవశాత్తు జరిగిందా.. ఎవరైనా దుండగుల హస్తం ఉందా..? ఇప్పటికే రాజకీయ దుమారం రేపిన అంతర్వేది ఘటనపై ఇప్పటికే సీఎం జగన్ సీబీఐ ఎంక్వైరీ కోరారు. ఈ వ్యవహారంపై జనసేన, బీజేపీ, టీడీపీ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఆందోళన నిర్వహించడం ఇలా ఎన్నో చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ, ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశాయి. అంతకుముందు వరకు వైసీపీ విషయంలో సఖ్యతగా ఉంటూ వచ్చిన బీజేపీ సైతం పూర్తిగా వైసీపీని టార్గెట్ చేసింది.
Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్….?
తమను టార్గెట్ చేశారని గ్రహించిన సీఎం జగన్ ఈ వ్యవహారంలో మరిన్ని తలపోట్లు రాకముందే, ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలంటూ, బీజేపీ ద్వారా లేఖ రాయించారు. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. కానీ.. మళ్లీ బీజేపీ తాజాగా ఏపీ గవర్నర్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
ఈ వివాదం జరుగుతున్న సమయంలో వెల్లంపల్లిపై నోరు జారి మరీ జనసేన అధినేత పవన్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతర్వేది సంఘటనపై ఓ సందర్భంలో స్పందించిన వెల్లంపల్లి రథానికి ఇన్సూరెన్స్ ఉందిలే అన్న మాటలు వివాదాస్పదమయ్యాయి. అలాగే విజయవాడ దుర్గమ్మ గుడికి సంబంధించిన వ్యవహారం పైన కొద్ది రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈయన పనితీరుపై జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, దీనికితోడు బీజేపీ సైతం పదేపదే వెల్లంపల్లిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండటం, ఆయనపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవ్వడం వంటి కారణాలతో వెల్లంపల్లిని తప్పిస్తారు అనే ప్రచారం ఊపందుకుంది.
Also Read: ఏపీ భూకుంభకోణాల ఎఫ్‌ఐఆర్‌లకు నివాళి: ‘ద వైర్’ ఎడిటర్ నిరసన
‘ఆరుతున్న మంటలపై మరింత పెట్రోల్ పోసినట్లుగా’ బీజేపీ వ్యవహారం నడుస్తుండడంతో జగన్ సేన మదనపడుతోంది. కేంద్రంలో బీజేపీకి సపోర్టుగా నిలుస్తున్న జగన్ సర్కార్‌కు.. రాష్ట్ర బీజేపీ రోజుకో తీరుగా ఇబ్బంది పెడుతోంది. వీటన్నింటి నుంచి జగన్ సర్కార్ ఎలా బయటపడుతారో చూడాలి. ఈ విమర్శలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఓ మంత్రిని పదవి నుంచి పక్కన పెట్టే పరిస్థితి వచ్చినట్లే కనిపిస్తోంది.