https://oktelugu.com/

డ్రగ్స్ కేసులో కథనాలపై ఢిల్లీ హైకోర్టుకు రకూల్ 

రకూల్ ‌ప్రీత్ సింగ్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్. ప్రముఖ హీరోలందరితో కలిసి స్క్రీన్‌ షేర్‌‌ చేసుకున్న రకూల్‌ ఇటీవల డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టను ఆశ్రయించారు. Also Read: దెబ్బకు చేతులెత్తి దండం పెట్టిన బండ్ల గణేష్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసులో సంచలనం విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన లవర్‌‌ రియాను అదుపులోకి తీసుకొని విచారించగా డ్రగ్స్‌ వ్యవహారం తెలిసింది. దీంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2020 / 03:47 PM IST
    Follow us on

    రకూల్ ‌ప్రీత్ సింగ్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్. ప్రముఖ హీరోలందరితో కలిసి స్క్రీన్‌ షేర్‌‌ చేసుకున్న రకూల్‌ ఇటీవల డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టను ఆశ్రయించారు.

    Also Read: దెబ్బకు చేతులెత్తి దండం పెట్టిన బండ్ల గణేష్

    నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసులో సంచలనం విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన లవర్‌‌ రియాను అదుపులోకి తీసుకొని విచారించగా డ్రగ్స్‌ వ్యవహారం తెలిసింది. దీంతో అప్పటి నుంచి బాలీవుడ్‌ సహా శాండిల్‌వుడ్‌, టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇందులో టాలీవుడ్‌ హీరోయిన్‌ రకూల్‌ పైనా ఆరోపణలు వచ్చాయి.

    అందుకే.. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలను ఆపాలని పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మేరకు సమాచార శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన జస్టిస్‌ చావ్లా ధర్మాసనం రకూల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.

    Also Read: సీరియల్ రేటింగ్ కూడా బిగ్ బాస్ కు రావట్లేదా?

    ఈ మేరకు సమాచార, ప్రచార శాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌కౌన్సిల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రియాను రకూల్‌, సారా అలీఖాన్‌ పేర్లు చెప్పినట్లు ఇటీవల ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రకూల్‌ప్రీత్‌సింగ్‌ గురించి చానల్స్‌, సోషల్‌ మీడియాల్లో పుంకానుపుంకాలుగా కథనాలు వచ్చాయి. వీటిని అడ్డుకోవాలంటూ రకూల్‌ హైకోర్టును సంప్రదించడంతో ఈ మేరకు పాజిటివ్‌ తీర్పు వచ్చింది.