
MAA Elections: ‘మా’ ఎన్నికల గోల ముగిసింది. ఇక నటీనటుల మధ్య గందరగోళ వివాదాలు కూడా ముగుస్తాయి అనుకుంటే.. అవి ఇప్పట్లో ముగిసేలా లేవు. ముదిరిన వివాదం కారణంగా ఫలితాలపై తీవ్ర గందరగోళం రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ తెలివిగా ఆరోపణలు చేస్తూ మంచు విష్ణు ప్యానల్ ను ఇరకాటంలోకి నెడుతుంది. ముఖ్యంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని ప్రకాష్ రాజ్ బలంగా ఆరోపిస్తున్నాడు.
ఈ క్రమంలో ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్నా రచ్చ మాత్రం నిత్యం రొచ్చు క్రియేట్ చేస్తూనే ఉంది. ఓ వైపు డైలాగ్ వార్.. మరో వై వివాదాల పదును.. వెండి తెర పై తమ నటనతో మెప్పించే నటులు.. నిజజీవిత తెర పై మాత్రం జీవిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈ సారి సీన్ లోకి పోలీసులు కూడా ఎంట్రీ ఇవ్వడమే ఆశ్చర్యకరమైన విషయం.
తాజాగా మా ఎలక్షన్ జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లోని సర్వర్ రూమ్ కు పోలీసులు లాక్ చేయడం జరిగింది. అసలు ఎందుకు లాక్ చేశారు ? ఏం జరిగింది ? ఇంతకీ ఏం జరగబోతోంది ? అనే విషయాలు కూడా అర్ధం కానీ పరిస్థితి ఉంది. ఇష్యూ అంతా సీసీ ఫుటేజ్ చుట్టూ తిరుగుతోంది కాబట్టి.. ఆ సీసీ ఫుటేజ్ కి సంబంధించి ఏమైనా కీలక ఆధారాలు దొరికాయా ?
ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్ గట్టిగా డిమాండ్ చేశారు. ఏం లేకపోతే.. ప్రకాష్ రాజ్ ఎందుకు అంతగా డిమాండ్ చేస్తారు ? మరోపక్క ఫుటేజ్ ఇవ్వడం కుదరదని ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ ఎందుకు వాదిస్తున్నారు ? ఎలాంటి అక్రమాలు జరగనప్పుడు ఫుటేజ్ ఇస్తే ఏం అవుతుంది ? ఫుటేజ్ ఇవ్వట్లేదు కాబట్టి.. ముఖ్యమైన అంశాలు మరుగున పడుతాయని ప్రకాష్ రాజ్ బ్యాచ్ చెబుతూ వస్తోంది.
మొత్తమ్మీద ఈ ఇష్యూలోకి పోలీసుల కూడా ఎంట్రీ ఇచ్చారు కాబట్టి.. మరి నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని ఆశిద్దాం. ఇప్పటికి అయితే ఎన్నికల రోజున మోహన్ బాబు, నరేష్ రౌడీయిజం చేశారన అర్ధం అయిపోతుంది. అలాగే కొందరి పై భౌతిక దాడులకు కూడా దిగారాని చెబుతున్నారు. సీసీఫుటేజ్, పోలీసులు ఇప్పటికైనా అన్ని విషయాలు బయట పెట్టాలని కోరుకుందాం.