https://oktelugu.com/

మహానగరానికి మరో ముప్పు..!

కరోనా వైరస్‌ ఇప్పటికే గడగడలాడించింది. ఇక ఇప్పుడు కొత్త రకం కరోనా వైరస్‌ అంటూ ప్రచారంలోకి రావడంతో మరోసారి తెలుగు రాష్ట్రాలు అలర్ట్‌ అయ్యాయి. బ్రిటన్‌ వేదికగా కొత్త రకం వైరస్‌ వెలుగులోకి రావడంతో ఇప్పుడు అక్కడికి రాష్ట్రాలకు చేరుకున్న వారిపై ఫోకస్‌ పెట్టారు. ఆల్రెడీ ఒక వైరస్‌ను ఎదుర్కొన్న అనుభవం ఉండడంతో ఇప్పుడు కొత్త వైరస్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అయిపోయాయి పాలకవర్గాలు. Also Read: నివర్‌‌ బాధిత రైతుల కోసం పవన్‌ ప్రత్యక్ష పోరాటం అయితే.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 24, 2020 / 02:02 PM IST
    Follow us on


    కరోనా వైరస్‌ ఇప్పటికే గడగడలాడించింది. ఇక ఇప్పుడు కొత్త రకం కరోనా వైరస్‌ అంటూ ప్రచారంలోకి రావడంతో మరోసారి తెలుగు రాష్ట్రాలు అలర్ట్‌ అయ్యాయి. బ్రిటన్‌ వేదికగా కొత్త రకం వైరస్‌ వెలుగులోకి రావడంతో ఇప్పుడు అక్కడికి రాష్ట్రాలకు చేరుకున్న వారిపై ఫోకస్‌ పెట్టారు. ఆల్రెడీ ఒక వైరస్‌ను ఎదుర్కొన్న అనుభవం ఉండడంతో ఇప్పుడు కొత్త వైరస్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అయిపోయాయి పాలకవర్గాలు.

    Also Read: నివర్‌‌ బాధిత రైతుల కోసం పవన్‌ ప్రత్యక్ష పోరాటం

    అయితే.. హైదరాబాద్ యంత్రాంగానికి ఈ కొత్త రకం కరోనా వల్ల ఊహించని ఇబ్బంది ఎదురైంది. బ్రిటన్‌లో కరోనా మ్యూటెడ్ వెర్షన్‌ను కనుగొన్న టైమ్‌లో ఆ దేశం నుంచి హైదరాబాద్‌కు ఏకంగా 3 వేల మంది వచ్చారు. వీళ్లలో 800 మంది ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నారు. గడిచిన నెల రోజుల్లో బ్రిటన్ నుంచి తెలంగాణకు 3 వేల మంది వచ్చినట్టు స్వయంగా ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసర్లే వెల్లడించారు. వీళ్లను రెండు వర్గాలుగా విభజించారు. మొదటి 2 వారాల్లో వచ్చిన వాళ్లు 1800 మంది ఉన్నారు. వీళ్ల నుంచి పెద్దగా ఎలాంటి ఇబ్బంది లేదనేది నిపుణుల అభిప్రాయం. అయినప్పటికీ వీళ్లకు కూడా టెస్టులు చేస్తున్నారు.

    కానీ.. డిసెంబర్ 9 తర్వాత తెలంగాణకు వచ్చిన 1200 మంది ఇప్పుడు సమస్యాత్మకంగా మారారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరితోపాటు, వాళ్ల కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 1200 మందిలో 800 మంది హైదరాబాద్‌లోనే ఉన్నారనే విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆ 800 మందిని గుర్తించే పనిని జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఇప్పటివరకు 200 మందిని మాత్రమే ట్రేస్‌ చేశారు. మిగతావారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

    Also Read: టీఆర్ఎస్ లో రచ్చ.. తెలంగాణ సీఎం మారబోతున్నారా?

    టెస్టులతో సంబంధం లేకుండా వీళ్లను కొన్ని రోజులపాటు ఐసొలేషన్‌లో ఉంచాలని నిర్ణయించారు. అయితే.. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరూ ఇంటికే పరిమితం కారు. ఆ పది రోజుల్లో వారు ఎక్కడెక్కడ తిరిగారో తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద టాస్క్‌లా మారింది. షాపింగ్‌తోపాటు బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లే ఉంటారు. అదే ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదంటున్న అధికారులు, ముందుజాగ్రత్త చర్యగా 3 ప్రధాన ఆస్పత్రులను రెడీ చేసి పెట్టారు. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ -టిమ్స్ లో 3 అంతస్తులను కేవలం లండన్ నుంచి వచ్చిన వాళ్ల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. మిగితా 600 మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ఎందుకైనే మంచిది హైదరాబాద్‌ వాసులు మరోసారి అలర్ట్‌గా ఉంటేనే మంచిదేమో.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్