https://oktelugu.com/

ఉత్తరాంధ్రలో టీడీపీకి మరో షాక్‌.. వైసీపీలోకి మరో ఎమ్మెల్యే

టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించాడు. ఒకానొక సందర్భంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందా అనే ప్రశ్న అందరిలోనూ వచ్చింది. అన్ని విధాలా జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇప్పుడు ఇక జగన్‌ వంతు వచ్చినట్లైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమిని చవిచూసింది. కనీసం ప్రతిపక్షం పాత్ర కూడా పోషించలేని స్థాయికి దిగజారింది. సీఎం జగన్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ లాంటివేవీ చేపట్టకుండానే టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2020 / 09:58 AM IST

    chandrababu jagan

    Follow us on


    టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించాడు. ఒకానొక సందర్భంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందా అనే ప్రశ్న అందరిలోనూ వచ్చింది. అన్ని విధాలా జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇప్పుడు ఇక జగన్‌ వంతు వచ్చినట్లైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమిని చవిచూసింది. కనీసం ప్రతిపక్షం పాత్ర కూడా పోషించలేని స్థాయికి దిగజారింది. సీఎం జగన్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ లాంటివేవీ చేపట్టకుండానే టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు వలసలు వస్తున్నారు.

    Also Read: వైసీపీ ఎమ్మెల్యేకు కోర్టు షాక్… కేసు పెట్టాలని ఆదేశాలు..?

    రోజురోజుకూ ఏపీలో టీడీపీ గ్రాఫ్‌ తగ్గుతుండడం.. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే శక్తిసామర్థ్యాలు ఉన్న లీడర్‌‌ లేకపోవడంతో.. ఆ పార్టీ నేతలు మనోస్థైర్యం కోల్పోతున్నారు. అందుకే.. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అని చూస్తున్నారు.

    తాజాగా.. ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్‌ తగిలింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ టీడీపీకి గుడ్‌ బై చెబుతున్నారు. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలువనుండగా.. ఆయన సాంకేతికంగా వైసీపీలో చేరే అవకాశాలు కనిపించడం లేదు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాగే టీడీపీకి దూరమై వైసీపీ గూటికి చేరనున్నారు.

    టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి మాదిరిగానే గణేష్‌ కూడా వైసీపీలో సాంకేతికంగా చేరరు. జగన్‌ వెంటే నడుస్తారు కానీ.. వైసీపీ కండువా మాత్రం మెడలో వేసుకోరు.

    Also Read: కేంద్రంలో వియ్యం.. రాష్ట్రంలో కయ్యం..

    కొంత కాలంలో పార్టీకి దూరంగా ఉంటున్న గణేష్‌ ఇప్పుడు చంద్రబాబుకు బైబై చెప్పడం అంటే.. పార్టీకి భారీ నష్టమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖపట్టణాన్ని కార్యనిర్వహక రాజధానిగా చేయడానికి జగన్‌ తీసుకున్న నిర్ణయంతో ఈ చేరిక మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.