రూ.100 లక్షల కోట్ల అప్పు.. కేంద్రానికి తప్పలేదు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద లక్షల కోట్లు.. అవును.. కేంద్రం చేసిన అప్పు ఇదీ. కరోనా లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థల ఖాతాలో కేంద్రం కూడా చేరింది. అవును.. అందరికీ పెద్దన్న అయిన కేంద్రం కూడా అప్పు చేసింది. ఏకంగా 100 లక్షల కోట్ల అప్పును నెత్తిన పెట్టుకుంది. Also Read: ఐపీఎల్ వేళాయే.. రేపటి నుంచి క్రికెట్ పండుగ కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆర్థిక మూలాలను భారీగా దెబ్బతీస్తోంది. […]

Written By: NARESH, Updated On : September 19, 2020 10:10 am

central debts

Follow us on

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద లక్షల కోట్లు.. అవును.. కేంద్రం చేసిన అప్పు ఇదీ. కరోనా లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థల ఖాతాలో కేంద్రం కూడా చేరింది. అవును.. అందరికీ పెద్దన్న అయిన కేంద్రం కూడా అప్పు చేసింది. ఏకంగా 100 లక్షల కోట్ల అప్పును నెత్తిన పెట్టుకుంది.

Also Read: ఐపీఎల్ వేళాయే.. రేపటి నుంచి క్రికెట్ పండుగ

కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆర్థిక మూలాలను భారీగా దెబ్బతీస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌, జూన్ క్వార్టర్‌‌లో ఏకంగా మైనస్‌ 32.9 శాతానికి పడిపోయింది. తర్వాతి స్థానంలో మైనస్‌ 23.9 శాతంతో భారత్‌ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు బ్రేక్‌ పడింది. దీంతో ఇప్పుడు రాష్ట్రాలను అప్పులతోనే నడిపించాల్సి వస్తోంది.  మరోవైపు అసలు కేంద్రమే అంత అప్పుల్లో ఉందన్న సంగతి తెలిసి ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ అప్పులు ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి రూ.101.3 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇది విని అందరూ షాక్ అయ్యారు.

Also Read: చైనాకు అమెరికా భారీ షాక్.. టిక్ టాక్ సహా యాప్ లపై నిషేధం

గత ఏడాది జూన్ చివరి నాటికి సర్కారీ అప్పుల భారం రూ.88.18 లక్షల కోట్లుగా ఉంది. ఇలా మనం వేలు లక్షల్లో అప్పు చేస్తే మన అందరినీ పాలించే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏకంగా వంద లక్షల కోట్లను అప్పు చేసింది.

మార్చి 31 నాటికి రూ.94.6 లక్షల కోట్లుగా ఉన్న అప్పు.. మహమ్మారి వల్ల గత మూడు నెలల్లోనే అదనంగా మరో 6.7 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల  అమలు కోసం ఈ అప్పు చేసినట్లు చెప్పింది.