https://oktelugu.com/

జేసీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కార్ బిగ్ షాక్..?

గత కొన్ని నెలల నుంచి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రతిపక్ష టీడీపీ నేతలకు, పార్టీపై విమర్శలు చేసే వాళ్లకు భారీ షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. మైనింగ్‌శాఖ నుంచి జేసీ కుటుంబానికి నోటీసులు జారీ అయ్యాయి. సుమన, భ్రమరాంబ కంపెనీల పేరుతో జేసీ మైనింగ్ క్యారీలను నిర్వహిస్తుండగా ఆయన కంపెనీల్లో అక్రమాలు జరుగుతున్నాయని అధికారులు తేల్చారు. అనంతపురం […]

Written By: Kusuma Aggunna, Updated On : October 10, 2020 8:58 pm
Follow us on

గత కొన్ని నెలల నుంచి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రతిపక్ష టీడీపీ నేతలకు, పార్టీపై విమర్శలు చేసే వాళ్లకు భారీ షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. మైనింగ్‌శాఖ నుంచి జేసీ కుటుంబానికి నోటీసులు జారీ అయ్యాయి. సుమన, భ్రమరాంబ కంపెనీల పేరుతో జేసీ మైనింగ్ క్యారీలను నిర్వహిస్తుండగా ఆయన కంపెనీల్లో అక్రమాలు జరుగుతున్నాయని అధికారులు తేల్చారు.

అనంతపురం జిల్లా ముచ్చుకోట ప్రాంతంలో జేసీకు చెందిన డోలమైట్ మైనింగ్ క్యారీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో కార్మికుల భద్రతకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదని అధికారుల విచారణలో తేలింది. మైనింగ్ పనులను పర్యవేక్షించడానికి అక్కడ మినరల్ మేనేజర్ లేడని.. నిబంధనలు పాటించకపోవడంతో నోటీసులు జారీ చేశామని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ రమణారావు తెలిపారు.

ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ నోటీసుల వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఆయన వెల్లడించారు. జేసీ మైనింగ్ శాఖ జారీ చేసిన నోటీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గనులపై ఆధారపడి తమ కుటుంబం జీవనం సాగిస్తోందని గతంలో మా తమ్ముడిని టార్గెట్ చేశారని, ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారని జేసీ చెప్పారు.

పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేయవద్దని.. బానిక బ్రతుకు బతకవద్దని జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో జేసీకి చెందిన త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజును, సున్నపు రాతి గనుల ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. నోటీసులు జారీ చేసిన మైనింగ్ శాఖ భవిష్యత్తులో మైనింగ్ క్వారీల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.