https://oktelugu.com/

ఇప్పుడెలా? మహేష్ బాబు ప్లాన్ బెడిసికొట్టిందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారిపాట’. మహేష్ బాబు-పర్శురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ‘సర్కారువారిపాట’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అదేరోజు సినిమా ఫస్టు లుక్ విడుదలచేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఈ ఫస్టు లుక్కుకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. Also Read: ఆ ఒక్క సినిమా చేసి రాజమౌళి రిటైర్ అవుతాడా? అయితే కరోనా కారణంగా షూటింగు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 10, 2020 / 08:40 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారిపాట’. మహేష్ బాబు-పర్శురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ‘సర్కారువారిపాట’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అదేరోజు సినిమా ఫస్టు లుక్ విడుదలచేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఈ ఫస్టు లుక్కుకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

    Also Read: ఆ ఒక్క సినిమా చేసి రాజమౌళి రిటైర్ అవుతాడా?

    అయితే కరోనా కారణంగా షూటింగు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ సినిమా విషయంలో మహేష్ బాబు క్లారిటీ ఉన్నారు. సినిమాను కేవలం రెండు షెడ్యూల్లోనే పూర్తి చేయాలని దర్శకుడికి సూచించినట్లు సమాచారం. ఈమేరకు అతడి డేట్స్ కూడా అడ్జస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ కోసం మహేష్ బాబు ఏకంగా 45రోజులపాటు కాల్షీట్స్ ఇచ్చినట్లు సమాచారం.

    దీంతో దర్శకుడు పర్శురాం అమెరికాలో లోకేషన్ల కోసం రెక్కీకి వెళ్లాడు. సినిమా కోసం నటీనటులందరినీ అమెరికాను తరలించేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. అయితే సడెన్ గా ఈ షెడ్యూల్ మొత్తం కాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. వీసాల సమస్య అని చిత్రయూనిట్ చెబుతున్నా అక్కడ షూటింగ్ కాస్తా అనే కారణంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

    Also Read: చంటి అడ్డాలపై ఫైర్ అయిన నిర్మాత న‌ట్టికుమార్

    ఇప్పటికే పలువురు దర్శకులు అమెరికాలో షూటింగ్ ఉంటే క్యాన్సిల్ చేసుకొని యూరప్ వెళుతున్నారు. పూరి జగన్మాథ్ కూడా తన సినిమాను అమెరికాలో తెరకెక్కించాలని భావించాడు. అయితే ప్రస్తుతం ఆ సినిమా షూటింగు ఇటలీలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం నటీనటులు ఇచ్చిన డేట్స్.. కాల్ షీట్లు మొత్తం క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా విషయంలో మహేష్ ప్లాన్ బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ నవంబర్లో కాకుండా జనవరి నుంచి ప్రారంభం కానుందనే టాక్ విన్పిస్తోంది.