https://oktelugu.com/

Pan 2.0 Project: పాన్‌ 2.0.. 42 ఏళ్ల తర్వాత అప్‌డేట్‌.. కొత్తగా క్యూఆర్‌ కోడ్‌తో జారీ..!

భారత దేశంలో ప్రస్తుతం ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు అనేవి తప్పని సరి అయ్యాయి. ఆర్థిక పరమైన లావాదేవీలకు ఇవి తప్పనిసరి. ఇందులో ఏది లే కపోయినా ఖాతాలు స్తంభించి పోతాయి. ఇక ఆధార్‌ అనుసంధానం కోసం కూడా కేంద్రం చర్యలు చేపడతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 26, 2024 / 09:46 AM IST

    Pan 2.0 Project

    Follow us on

    Pan 2.0 Project: మన దేశంలో ఆర్థిక, పన్ను వ్యవస్థలను ఆధునికీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు కీలకమైన ఆధార్, పాన్‌కార్డులను అప్‌డేట్‌ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆధార్‌ జారీ అయి పదేళ్లు పూర్తయినవారు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తోంది. అప్‌డేట్‌ చేసుకోకుంటే కార్డు రద్దు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఫ్రీ అప్‌డేట్‌ గడువును నాలుగుసార్లు పెంచింది. ఇక ఆధార్‌తోపాటు మరో ముఖ్యమైన కార్డు పాన్‌ కార్డు. బ్యాంకు లావాదేవీలకు తప్పనిసరి. వేతన జీవులకు తప్పనిసరి. దీనిని ఆధార్‌తో అనుసంధానం చేస్తోంది. ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. అయినా పన్ను ఎగవేతదారులు తగ్గడం లేదు. ఈ తరుణంలో పాన్‌ కార్డును అప్‌డేట్‌ చేయాలని కేంద్రం భావిస్తోంది. పాన్‌ 2.0 ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. కొత్త కార్డులు లేటెస్ట్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు సేవలందిచడానికి ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది.

    1972లో ప్రారంభం..
    ఆదాయపు పన్న ఎగవేత దారులను గుర్తించేందుకు పన్ను చెల్లింపుల్లో పారదర్శకత కోసం ఆదాయపు పన్న చట్టంలోని సెక్షన్‌ 139 ఏ కింద 1972లో పాన్‌ కార్డును కేంద్ర ప్రారంభించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పాన్‌కార్డును అప్‌డేట్‌ చేయలేదు. డిజటల్‌ చేసినా.. పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ చేయలేదు. దీంతో తాజాగా మోదీ ప్రభుత్వం పాన్‌ కార్డు 2.0ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో 78 కోట్లకుపైగా సాధారణ పాన్‌కార్డు ఉన్నాయి. రాబోయే రోజుల్లో క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌కార్డు పంపిణీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

    రూ.1,435 కోట్లు కేటాయింపు..
    పాన్‌కార్డు అప్‌గ్రేడ్‌ కోసం కేంద్రం రూ.1,435 కోట్లు కేటాయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపు పన్నులో పారదర్శకత పెంచేందుకు పాన్‌ 2.0 తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈమేరు క్యాబినెట్‌ కమిటీ పాన్‌ 2.0కు ఆమోదం తెలిపింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని పాన్‌ 2.0 ప్రవేశ పెడుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.