https://oktelugu.com/

సీఐడీ సునీల్ కుమార్ కు మరో కొత్త చిక్కు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ మరో కొత్త చిక్కుల్లో పడ్డారు. సునీల్ కుమార్ ఒక క్రిస్టియన్ అని.. ఆయన క్రైస్తవాన్ని స్తుతిస్తూ చెప్పిన వీడియోలు పట్టుకొని కొందరు ఆయన కులం పై ఫిర్యాదు చేయడం సంచలనమైంది. ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‍కుమార్‍పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. సునీల్ కుమార్ ఎస్సీ రిజర్వుడు సర్టిఫికెట్ తో ఇప్పటివరకు అవకాశాలు పొందుతూ వచ్చారని.. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2021 5:08 pm
    Follow us on

    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ మరో కొత్త చిక్కుల్లో పడ్డారు. సునీల్ కుమార్ ఒక క్రిస్టియన్ అని.. ఆయన క్రైస్తవాన్ని స్తుతిస్తూ చెప్పిన వీడియోలు పట్టుకొని కొందరు ఆయన కులం పై ఫిర్యాదు చేయడం సంచలనమైంది.

    ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‍కుమార్‍పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. సునీల్ కుమార్ ఎస్సీ రిజర్వుడు సర్టిఫికెట్ తో ఇప్పటివరకు అవకాశాలు పొందుతూ వచ్చారని.. ఈ విషయాన్ని గుర్తించిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్ఐ జోసి తాజాగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. సునీల్‍కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లీగల్ రైట్స్ అడ్వైజరీ ఫిర్యాదు చేశారు.

    ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్‍గా మతం మార్చుకున్న సునీల్‍కుమార్‍ను, సర్వీస్ నుంచి తప్పించాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రిస్టియన్ గా మతం మార్చుకున్న సునీల్ కుమార్ అన్ని రకాల రిజర్వేషన్లను అనుభవిస్తున్నారని.. ఆయనను తక్షణం సర్వీస్ నుంచి తప్పించాలని కోరారు.

    మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‍ను వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టుతీర్పు మేరకు సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తొలగించాలని విన్నవించారు.

    సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సునీల్‍కుమార్ ప్రారంభించిన సంస్థపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    సునీల్ పై సెక్షన్ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్‍ఐఆర్ నమోదు చేసి హోంశాఖ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఎల్‍ఆర్‍వో కన్వీనర్ ఎన్‍ఐ జోషి డిమాండ్ చేశారు.

    ఇప్పటికే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల నుంచి వైసీపీ తరుఫున గెలిచిన వారిపై రాష్ట్రపతికి ఫిర్యాదులు వెల్లాయి. వైసీపీ తరుఫున గెలిచి ఎస్సీ నుంచి మతం మారిన హోంమంత్రి సుచరిత, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వంటి వారిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. మతం మారిన వారికి రిజర్వేషన్లు చెల్లవని కోర్టులు తేల్చిచెప్పాయి. ఇప్పుడు సునీల్ కుమార్ పై ఫిర్యాదు చర్చనీయాంశమైంది.