రెండు రోజులు కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. ముఖ్యంగా భాగ్యనగరం పరిస్థితి మరీ దయనీయంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికీ నీటిలోనే ఉండడం కలవరానికి గురిచేస్తోంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ శివారు ప్రాంతాలవారు వరదనీటిలోనే చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దాదాపు రోజంతా విద్యుత్ సరఫరా లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Also Read: కేసీఆర్ సార్.. ఇవేనా మీ ‘డబుల్ బెడ్ రూం’లు?
ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాలతో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయని తమ దృష్టికి వచ్చిందన్నారు.అవసరమైన చోట అధికారులు చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు.
ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో విద్యుత్‌ను పునరిద్ధరించలేదని సీఎం చెప్పారు. విద్యుత్‌సరఫరా దెబ్బతిన్న ప్రాంతాలకు ఆ శాఖ సిబ్బంది వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఈ ఇబ్బందులు తప్పలేదన్నారు. హైదరాబాద్‌తో సహా పలు పట్టణాల్లో అపార్టుమెంట్లు వరదనీటితో నిండాయని, అందుకు విద్యుత్ సరఫరా చేయలేకపోయామని సీఎం చెప్పారు.
Also Read: దుబ్బాకకు పోటెత్తిన కాషాయదండు.. రఘునందన్ రావు లో గెలుపు ధీమా!
వర్షాభావం తగ్గే పరిస్థితి కనిపించగానే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వరదల నేపథ్యంలో విద్యుత్‌శాఖ చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. ఆ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని తెలుసుకున్నారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా విద్యుత్‌శాఖ సిబ్బంది కష్టపడుతున్నారని కొనియాడారు.