కాపు ఉద్యమంలో మరో కీలక పరిణామం

కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు.. కాపుల సమస్యల పరిష్కారం.. కాపుల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం కొన్నేళ్లుగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర కూడా చేశారు. మొన్నటివరకు ముద్రగడ నేతృత్వంలో కాపు ఉద్యమం బలంగా నడిచింది. కానీ.. ఇప్పుడు ఆ ఉద్యమాన్ని నడిపేందుకు బలమైన నేత కరువయ్యారట. Also Read: కొత్త రూల్స్: రోడ్డు ఎక్కేముందు తప్పక తెలుసుకోండి ఇన్నాళ్లు ఉద్యమాన్ని ఓస్థాయిలో నడిపించిన ముద్రగడ.. […]

Written By: NARESH, Updated On : September 29, 2020 12:13 pm

mudragada padmanabham

Follow us on


కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు.. కాపుల సమస్యల పరిష్కారం.. కాపుల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం కొన్నేళ్లుగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర కూడా చేశారు. మొన్నటివరకు ముద్రగడ నేతృత్వంలో కాపు ఉద్యమం బలంగా నడిచింది. కానీ.. ఇప్పుడు ఆ ఉద్యమాన్ని నడిపేందుకు బలమైన నేత కరువయ్యారట.

Also Read: కొత్త రూల్స్: రోడ్డు ఎక్కేముందు తప్పక తెలుసుకోండి

ఇన్నాళ్లు ఉద్యమాన్ని ఓస్థాయిలో నడిపించిన ముద్రగడ.. రెండు నెలల క్రితం తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాపు ఉద్యమంలో జరుగుతున్న పరిణామాలే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలయ్యాయి. సొంత సామాజిక వర్గం నుంచే తనపై విమర్శలు ఎక్కువయ్యాయని, తాను ప్రస్తుతమున్న నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని నడపలేనని ముద్రగడ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్ అవుతున్న విషయాలపై కూడా ముద్రగడ చిన్నబోయారు.

అయితే.. ముద్రగడ ఈ ఉద్యమం నుంచి తప్పుకోవడంతో తాను ఆ బాధ్యతలను నిర్వర్తిస్తానంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ముందుకొచ్చారు. ఇందుకు కొందరితో కలిసి సమన్వయ కమిటీ కూడా వేశారు. అయితే.. జోగయ్య మీద నమ్మకం లేకపోవడం.. వయసు రీత్యా ఉద్యమాన్ని నడిపించలేరని 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు సమావేశమై తిరిగి ముద్రగడ పద్మనాభం కొనసాగాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

Also Read: నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. కోటి రూపాయల సెక్యూరిటీ లేని లోన్!

ఏకంగా ముద్రగడ ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించారట. వారికి పద్మనాభం షాక్‌ ఇచ్చాడు. తాను ఉద్యమానికి నేతృత్వం వహించలేనని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలకు నేతృత్వం వహించలేనంటూ ఓ లేఖ ఇచ్చాడు. ఇక తనను ఇబ్బంది పెట్టవద్దని అభ్యర్థించాడు. దీంతో వెనుదిరిగి జేఏసీ నేతలు.. చివరగా ముద్రగడ సారథ్యంలోనే ఉద్యమం నడుస్తుందని చెప్పుకురావడం గమనార్హం.