
టాలీవుడ్ దిగ్గ దర్శకుడు రాజమౌళి తీస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీలో బాల నటులెవరో తెలిసిపోయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. జనవరిలో మళ్లీ మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే వారి చిన్నప్పటి పాత్రలను వేయడానికి బాలనటులు సెలెక్టయ్యారట. చక్రి, వరుణ్ బుద్ధదేవ్, స్పందన చతుర్వేదిలు ఈ సినిమాలో కనిపించనున్నారు. స్పందన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ”ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో మధుర జ్ఞాపకాలు అంటూ పేర్కొంది.. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.