https://oktelugu.com/

Nasal vaccine: కరోనా కొత్త వేరియంట్ కల్లోలం కేంద్రం మరో కీలక నిర్ణయం.. నాసల్ వ్యాక్సిన్ కు ఆమోదం

Nasal vaccine: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే టీకాలు వేసిన నేపథ్యంలో అందరికి టీకాలు వేసినా వైరస్ విజృంభిస్తుండటంతో ఏం చేయలనే దానిపై దృష్టి పెట్టింది. దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాసికా టీకా కు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దేశంలోని అందరికి ఈ టీకా వేసేందుకు సిద్ధమవుతోంి. ఇందులో భాగంగా టీ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 23, 2022 / 02:25 PM IST
    Follow us on

    Nasal vaccine: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే టీకాలు వేసిన నేపథ్యంలో అందరికి టీకాలు వేసినా వైరస్ విజృంభిస్తుండటంతో ఏం చేయలనే దానిపై దృష్టి పెట్టింది. దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాసికా టీకా కు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దేశంలోని అందరికి ఈ టీకా వేసేందుకు సిద్ధమవుతోంి. ఇందులో భాగంగా టీ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో లభ్యం కానుంది. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందరు తీసుకున్నారు. ఇప్పుడు నాసికా టీకా హెటిరోలాగస్ బూస్టర్ గా తీసుకోవాలని సూచిస్తోంది.

    Nasal vaccine

    ఈ నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరు ఈ టీకాను తీసుకోవాలని చెబుతోంది. ఇన్ కొవాక్ ను బూస్టర్ గా తీసుకుని వైరస్ నుంచి రక్షించుకోవాలని వెల్లడించింది. అమెరికాలో దాదాపు పదికోట్ల మందికి వైరస్ సోకినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జపాన్, చైనాల్లో వైరస్ కేసులు రెట్టింపవుతున్నాయి. దీంతో భవిష్యత్ లో మునుపటి రోజులు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఎల్లుండి క్రిస్మస్, జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు ఉన్న సందర్భంలో కొవిడ్ ఆంక్షలు విధిస్తున్నారు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు చేస్తోంది.

    చైనా, కొరియా, బ్రెజిల్ నుంచి వ్యాపించిన కొవిడ్ దక్షిణాసియాకు వ్యాపించింది. 35 రోజుల్లోనే వైరస్ భారత్ లోకి ప్రవేశించింది. తాజా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న 81 శాతం కేసులు పది దేశాల్లోనే వెలుగు చూస్తున్నాయని చెబుతున్నారు. ఇందులో జపాన్ ముందు వరుసలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం చైనాలో కనిపిస్తున్న ఉధృతి పెరగడానికి గల కారణాలు ఆరా తీస్తే సామర్థ్యం లేని టీకాలు, తక్కువ స్థాయి వ్యాక్సినేషన్, జీరో కొవిడ్ వ్యూహం వల్ల సంబంధిత నిరోధకత లభించడం లేదు.

    Nasal vaccine

    ఒమిక్రాన్ వేరియంట్ గా రూపాంతరం చెంది గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒకరికి సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు వైరస్ వేగంగా విస్తరించి మరిన్ని కేసులు వెలుగు చూస్తే ఏం చేయాలనేదానిపై కేంద్రం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో దేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేస్తోంది. వైరస్ నిరోధకతకు నిబంధనలు విధిస్తోంది. కొవిడ్ 2019 డిసెంబర్ లో వెలుగు చూసింది. ఇప్పుడు మళ్లీ అదే డిసెంబర్ లో వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

    Tags