Modi-Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తనకు ఏ చిన్న అవకాశం దొరికినా మోడీ ప్రభుత్వాన్ని పొగిడేస్తుంటుంది. రైతు చట్టాలను మోడీ సర్కారు రద్దు చేయడాన్ని తప్పుబట్టిన కంగన.. మోడీ అలా చేయకుండా ఉండాల్సిందని అంది. తాజాగా కంగనా రనౌత్ మరోసారి తన వీర విధేయతను చాటుకునే ప్రయత్నం చేసింది. పంజాబ్ రాష్ట్రంలో రైతుల నిరసనతో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రద్దు చేసుకుని దేశ రాజధాని ఢిల్లీ చేరకున్నారు. ఈ విషయం వివాదాస్పదమైంది. భద్రతా వైఫల్యం వల్లే ప్రధానికి పంజాబ్ పర్యటనలో చేదు అనుభవం ఎదురైందని కేంద్ర హోం శాఖ రాష్ట్రసర్కారుపై సీరియస్ అయింది. కాగా, ఈ విషయమై కంగన తాజాగా స్పందించింది.
ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన మార్క్ విమర్శలు చేసింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది కంగన. భారత్ స్టాండ్ విత్ మోడీజీ అనే హ్యాష్ ట్యాగ్ స్టార్ట్ చేసిన కంగన.. పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడ్డుకోవడం సిగ్గు చేటని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు మోడీ.. 140 కోట్ల జనాభాకు ప్రతినిధి అని తెలిపింది. ప్రధాన మంత్రిపైన దాడి అంటే అది ప్రతీ ఒక్క భారతీయుడిపైన దాడిగానే పరిగణించాలని, ఇది ముమ్మాటికీ మన ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని కంగన అంది. పంజాబ్ స్టేట్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని, వెంటనే వాటిని అరికట్టకపోతే దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కంగన ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Also Read: ఏమిటి.. సింగర్ సునీత మళ్ళీ తల్లి కాబోతుందా ?
అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో ఎటువంటి భద్రతా వైఫల్యం లేదని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు. చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించడం వల్లే అలా జరిగిందని చెప్పారు.
ఇకపోతే సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ విషయమై కామెంట్స్ భిన్న రకాలుగా చేస్తున్నారు. నిరసనలకే మోడీ సర్కారు భయపడిపోతున్నదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాజకీయంగా మైలేజ్ కోసం బీజేపీ ఈ స్టంట్ చేసందని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read: నిజమైన ఇండియన్ స్టార్ ఆమె మాత్రమే !