దేశ ప్రజల్లో 61శాతం మందిలో కోపం, అసంతృప్తి

దేశ ప్రజలు ఇప్పుడు రగిలిపోతున్నారు. దేశం మొత్తం జనాభాలో 61శాతం మంది ప్రజలు ప్రభుత్వాల తీరుపై కోపంగా.. అసంతృప్తిగా ఉన్నట్లు ‘లోకల్ సర్కిల్స్’ అనే సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. దేశం కరోనాతో అల్లకల్లోలంగా ఉంది. ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. రోగులకు ఆక్సిజన్ అందడం లేదు. వేల మరణాలు, లక్షల కేసులు.. నియంత్రణ పూర్తి కోల్పోయింది. వ్యాక్సిన్ల కొరతతో జనం హాహాకారాలు.. ఇలా ఇంతటి దురావస్థకు కారకులు ఎవరు అని ప్రజలను ప్రశ్నిస్తే వారి సమాధానం ఒకటే.. కేంద్ర, […]

Written By: NARESH, Updated On : May 7, 2021 6:07 pm
Follow us on

దేశ ప్రజలు ఇప్పుడు రగిలిపోతున్నారు. దేశం మొత్తం జనాభాలో 61శాతం మంది ప్రజలు ప్రభుత్వాల తీరుపై కోపంగా.. అసంతృప్తిగా ఉన్నట్లు ‘లోకల్ సర్కిల్స్’ అనే సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

దేశం కరోనాతో అల్లకల్లోలంగా ఉంది. ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. రోగులకు ఆక్సిజన్ అందడం లేదు. వేల మరణాలు, లక్షల కేసులు.. నియంత్రణ పూర్తి కోల్పోయింది. వ్యాక్సిన్ల కొరతతో జనం హాహాకారాలు.. ఇలా ఇంతటి దురావస్థకు కారకులు ఎవరు అని ప్రజలను ప్రశ్నిస్తే వారి సమాధానం ఒకటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే ఈ పాపం అని అంటున్నారు.

కరోనా సెకండ్ వేవ్ ను నియంత్రించలేని పాపం ఖచ్చితంగా దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్న ఆవేదన, ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోందని ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది.

ఇక ప్రభుత్వాలు కేసులు పెరిగే లాక్ డౌన్ అంటున్నాయి. కానీ ఆ లాక్ డౌన్ తో సర్వం మూతపడి పెద్ద ఎత్తున ఉపాధికి, ఉద్యోగాలకు దెబ్బ పడుతోంది. తినడానికి తిండికి, సాకడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుందట..

ఈ క్రమంలోనే ఈ సర్వేలో ప్రభుత్వాలు కరోనా కట్టడికి సరైన మార్గంలో వెళ్లట్లేదని 45శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 61శాతం మంది ప్రజలు ప్రభుత్వాల తీరుపై ఆగ్రహంగా ఉన్నారని సర్వేలో తేలింది.