
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అక్కడి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉండగా.. ఇప్పుడే వద్దంటూ జగన్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోగా ఎన్నికల సంఘం, ప్రభుత్వం చర్చించి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు పంచుకోవాలని సూచించారు. అయితే.. ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో కొత్త వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. ఇప్పుడు ఇది కాస్త ప్రభుత్వానికి ఆయుధంగా దొరికినట్లయింది.
Also Read: జగన్‌కు కేంద్రం పోల‘వరం’ : 2017–-18 ధరల ప్రకారమే నిధులు
నిన్నటిదాకా.. సెకండ్ వేవ్ అని మరొకటని.. వ్యాక్సిన్ అని.. కారణాలు చెప్పి.. ఎన్నికలు వాయిదా వేయించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. కానీ కోర్టు అంగీకరించలేదు. ఎన్నికల నిర్వహణలో పూర్తి అధికారం ఎస్‌ఈసీదే కాబట్టి ఆయనతోనే చర్చలు జరపాలని సూచించింది. ఆ ప్రకారం ఇప్పుడు చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తన పదవీకాలంలో ఒక్కసారి అయినా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో నిమ్మగడ్డ ఉన్నారు. ఇప్పటివరకూ తన రాజ్యాంగ అధికారాలను వీలైనంతగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు ఆయనకే అన్నీ కలసి వస్తున్నాయి.
Also Read: ఏడాదిన్నరలో ఒక్కో రైతుకు లక్షన్నర ఇచ్చాం
కానీ ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కరోనా స్ట్రెయిన్ వైరస్ ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. కొన్నిరకాల ఆంక్షలు విధించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. దీంతో నిమ్మగడ్డతో జరిపే చర్చల్లో ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. నిమ్మగడ్డ.. స్ట్రెయిన్ వైరస్ ప్రభావాన్ని ఎంతగా అంచనా వేసుకుంటారన్నది కీలకం. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరేమనుకున్నా తనకున్న అధికారంతో.. తాను చేయాలనుకున్నది చేయాలనుకుంటే మాత్రం ఎన్నికల నిర్వహణ తప్పకపోవచ్చు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్