Amrit Sarovar Mission AP: కేంద్ర ప్రభుత్వం నీటివనరుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో చెరువులు, కుంటలు బాగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత ఏప్రిల్ 24న దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఈ పథకంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. పథకం ప్రారంభ దశలో పదమూడో స్థానంలో ఉన్న ఏపీ ప్రస్తుతం మూడో స్థానానికి చేరిందంటే రాష్ట్రంలో పథకం ఎంత పకడ్బందీగా అమలవుతుందో తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ చూపించిన మార్గంలో ఏపీ ప్రయాణించడంతో మంచి ర్యాంకులో దూసుకుపోతోంది.

కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే రాష్ట్రాలలో ఏపీ కూడా ఒకటి కావడం తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం రాష్ట్రంలోని చెరువుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్రంలో 2,890 చెరువులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1809 చెరువుల్లో పనులు మొదలు పెట్టింది. 2023 ఆగస్టు నాటికి చెరువుల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది.
Also Read: Presidential Election: ఆధిక్యం దిశగా ముర్ము.. వెనుకబడిన యశ్వంత్ .. ద్రౌపది ఎన్ని ఓట్లు సాధించారంటే?
ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ముందంజలో ఉండగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. అమృత్ సరోవర్ కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వం చూపుతున్న చొరవతోనే పథకం ఇలా దూసుకుపోతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తోంది. దీంతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. ఎకరం విస్తీర్ణంలో ఉన్న చిన్ననీటి వనరులను కాపాడేందుకు కేంద్రం తీసుకున్న చర్యలకు రాష్ట్రాలు కూడా సహకరిస్తే పథకం లక్ష్యం నెరవేరి మంచి నీటిమట్టం కలిగి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆశయం.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. ఇప్పుడు అమృత్ సరోవర్ కార్యక్రమంలో మూడో స్థానంలోకి వెళ్లి ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. కేంద్రం సూచించిన విధంగా నీటి వనరుల అభివృద్ధికి పాటుపడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తగిన విధంగా సాయం అందిస్తోంది. దీంతోనే పథకం ప్రగతిపథంలో వెళ్తోంది. దీనికి అందరి సమన్వయం ఉంటోంది. అందుకే రాష్ట్రంలో చెరువుల పరిస్థితిలో కూడా మార్పు వస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Four-Day Workweek: నాలుగు రోజులే పని.. నష్టమా.. లాభమా!?
[…] […]