Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీకి రైల్వే జోన్ లేకుండా పోయింది. దీంతో 2019లో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా దక్షిణ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. కానీ విభజన హామీకి స్వస్తి పలుకుతూ రైల్వే జోన్ ప్రస్తావన మరచిపోయినట్లున్నారు. ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి ప్రకటన కూడా అదే విషయాన్ని తెలియజేస్తోంది. ప్రజల అభీష్టాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైల్వే జోన్ ఏర్పాటుపై సందేహాలు వస్తున్నాయి.

రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రకటన చేశారు. కానీ పనులు మాత్రం సాగడం లేదు. దీంతో ప్రజల వాంఛ తీరడం లేదు. ప్రజలు దీనిపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర వాసులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం వెనకడుగు వేయడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నారు.
రైల్వే జోన్ పనుల కోసం కేంద్రం ఓ అధికారిని సైతం నియమించినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రైల్వే జోన్ కు సంబంధించి అన్ని విషయాలు క్రోడీకరించి కేంద్రానికి నివేదిక పంపినా పనులు మాత్రం కదలడం లేదు. కేంద్రమే పనులు సాగనివ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
దీనికితోడు ప్రజాప్రతినిధులు సైతం పార్లమెంట్ లో తమ గొంతు వినిపించలేదు. దీంతో రైల్వే జోన్ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైపోయింది. ప్రజల కోరిక నెరవేరకుండానే మిగిలిపోతోంది. దీనిపై వైసీపీ కూడా ఏ మాట అనడం లేదు. రైల్వే ప్రాజెక్టు పనులు ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించడం లేదు. ఈ నేపథ్యంలో దక్షిణ రైల్వేజోన్ పనులు వాయిదా పడినట్లేనని తెలుస్తోంది.