Janasena Leader Nagababu: ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధికారం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు చొరవ తీసుకుంటున్నారు. వైసీపీపై మాటల యుద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని దుయ్యబడుతున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు రుణాంధ్ర ప్రదేశ్ గా మారుస్తున్నారని మండిపడుతున్నారు. వైసీపీ నిర్వాకంతో రాష్ట్రం అధోగతి పాలైందని చెబుతున్నారు. ఏపీలో పరిపాలన గాడి తప్పింది. ఫలితంగా ప్రజలు కష్టాలు పడుతున్నారు.

రూ.8 వేల కోట్ల అప్పులు చేసి జనం నెత్తిన రుద్దుతున్నారు. ఫలితంగా ప్రజలపై భారం మోపుతున్నారు. దీంతో రోజురోజుకు పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి. వైసీపీ పరిపాలనతో ప్రజలు సమిధలుగా మారుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజలపైనే భారం పడేలా చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఖాతాల్లో వేస్తున్న నిధులను కూడా మింగేస్తున్నారు. దీంతో సర్పంచులు వట్టి చేతులతోనే ఉండాల్సి వస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచులకు తెలియకుండా లాగేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
రూ.800 కోట్ల జీపీఎఫ్ ఖాతాల్లోని డబ్బును జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన ప్రభుత్వ మనుగడ కోసం ఇతరుల సొమ్మును స్వాహా చేసే ముఖ్యమంత్రి ఈయనే అని విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పతనం ఖాయమని జోస్యం చెబుతున్నారు. ఈ మేరకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడు వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.

నాగబాబు యాక్టివ్ కావడంతో కొణిదెల కుటుంబం మొత్తం పవన్ కల్యాణ్ వెంట నడిస్తారని భావిస్తున్నారు. ఇందు కోసమే సమగ్ర ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నేతలకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. రాబోయే రోజులు మనవే అని దీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ఏం చేయాలనేదానిపై కూడా వివరణ ఇస్తున్నారు. ప్రభుత్వ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చేస్తామని భరోసా ఇస్తున్నారు. దీంతో నాగబాబు యాక్టివ్ తో జనసేన రాష్ట్రంలో మరింత బలపడుతుందని కార్యకర్తలు ఆశిస్తున్నారు.
Also Read:Devendra Fadnavis: ఆటలో అరటిపండుగా మిగిలిన మాజీ సీఎం ఫడ్నావీస్