Amaravati Farmers: ఆంధ్రప్రదేశ్ లో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రైతులు రాజధాని అమరావతి కోసం మహా పాదయాత్ర చేపడుతున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రలో రైతులు స్వచ్చంధంగా పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. అది కూడా శాంతియుతంగా జరిగే పాదయాత్ర కావడంతో ఎవరు అడ్డు చెప్పాల్సిన పనిలేదు. కానీ అధికార పార్టీ కనుసన్నల్లో పోలీస్ యంత్రాంగాం గూండాల్లా ప్రవర్తిస్తోంది.

పాదయాత్రలో పాల్గొనే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేసే అన్నదాతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఇదేమి రాజ్యం అంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో తోపులాట జరిగింది. ఇందులో సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చేయి విరిగింది.
దీంతో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గతంలో జగన్ కూడా అధికారం కోసం పాదయాత్ర చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయనకో న్యాయం ఇప్పుడు మాకో న్యాయమా అని అడుగుతున్నారు. అధికార పార్టీ ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను వెనక్కి పిలిపించి పాదయాత్రను కొనసాగించేలా సహకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: AP employees: ఏపీ ఉద్యోగులకు ఎవరి సానుభూతి దక్కదా?
పోలీసులు కూడా వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ రైతులపై చేయి చేసుకుంటే ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు విధించినా ఎన్ని అవాంతరాలు కల్పించినా పాదయాత్ర కొనసాగించే తీరుతామని ప్రకటించారు. ప్రభుత్వ నిర్వాకంపై అందరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
Also Read: Dubai: దక్షిణాది సినిమా ప్రమోషన్లకు అడ్డాగా దుబాయ్!