https://oktelugu.com/

Illegal relationship Efair: రచ్చకెక్కిన ఎఫైర్.. రోడ్డుపైనే కొట్టుకున్న డాక్టర్, మహిళ

andhra pradesh nellore woman and doctor fighting on road over illegal relationship: చాటు మాటు వ్యవహారాలు ఎప్పటికైనా డేంజరే.,. కరోనా లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితం కావడంతో చాలా మంది ఇల్లీగల్ ఎఫైర్స్ అన్నీ బయటపడ్డాయి. ఎవరెవరు? ఎన్ని ఫ్యామిలీలు మెయింటేన్ చేస్తున్నారో తెలిసిపోయింది. అక్రమసంబంధాలు బయటపడ్డాయి. తాజాగా నెల్లూరులోనూ ఓ ఎఫైర్ బయటపడింది.నడిరోడ్డుపైనే వారిద్దరూ కొట్టుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఓ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2021 8:53 am
    Follow us on

    andhra pradesh nellore woman and doctor fighting on road over illegal relationship: చాటు మాటు వ్యవహారాలు ఎప్పటికైనా డేంజరే.,. కరోనా లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితం కావడంతో చాలా మంది ఇల్లీగల్ ఎఫైర్స్ అన్నీ బయటపడ్డాయి. ఎవరెవరు? ఎన్ని ఫ్యామిలీలు మెయింటేన్ చేస్తున్నారో తెలిసిపోయింది. అక్రమసంబంధాలు బయటపడ్డాయి. తాజాగా నెల్లూరులోనూ ఓ ఎఫైర్ బయటపడింది.నడిరోడ్డుపైనే వారిద్దరూ కొట్టుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

    ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఓ వివాహేతర సంబంధం చినిగి చాటైంది. రచ్చ రచ్చ అయ్యింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, ఓ వ్యక్తి నడిరోడ్డు మీదే తన్నుకున్న చోద్యం అక్కడున్న వారిని విస్మయపరిచింది. చివరకు బాధిత మహిళ జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ డాక్టర్ ఎఫైర్ పెట్టుకోవడంతో ఈ ఘటన స్థానికంగా వైరల్ అయ్యింది.

    నెల్లూరుకు చెందిన ఓ హోమియోపతి డాక్టర్, ఓ మహిళకు గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. కొంతకాలంగా సదురు వైద్యుడు ఆ మహిళను దూరం పెడుతూ వస్తున్నాడు. దీంతో అసలు మ్యాటర్ ఏంటా అని సదురు మహిళ తెలుసుకునేందుకు ఏకంగా ఆయన పనిచేసే ప్రాంతానికి వెళ్లింది.

    అక్కడ పనిచేస్తున్న డాక్టర్ ను కలిసి తనను ఎందుకు దూరం పెడుతున్నావని నిలదీసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. కోటేశ్వరరావు చొక్కా పట్టుకొని బయటకు లాక్కొచ్చింది సదురు మహిళ. ఈ క్రమంలోనే డాక్టర్ బాల కోటేశ్వరరావు, మహిళ పరస్పర దాడులు చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు.

    అనంతరం మహిళ జిల్లా ఎస్పీ విజయరావును ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఎస్పీ వద్ద మొర పెట్టుకుంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.