National Savings Certificate: ఈ పోస్టాఫీస్ స్కీమ్ తో రూ.6 లక్షల లాభం.. ఎలా అంటే..?

National Savings Certificate: దేశంలో పోస్టాఫీస్ లు ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. పోస్టాఫీస్ లు అమలు చేస్తున్న స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంత రాబడిని పొందుతామో అంతకంటే ఎక్కువ రాబడిని పొందవచ్చు. కనీసం 100 రూపాయల నుంచి గరిష్ట పరిమితి లేకుండా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ […]

Written By: Kusuma Aggunna, Updated On : September 5, 2021 8:43 am
Follow us on

National Savings Certificate: దేశంలో పోస్టాఫీస్ లు ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. పోస్టాఫీస్ లు అమలు చేస్తున్న స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంత రాబడిని పొందుతామో అంతకంటే ఎక్కువ రాబడిని పొందవచ్చు. కనీసం 100 రూపాయల నుంచి గరిష్ట పరిమితి లేకుండా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ పై ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ అమలులో ఉంది.

ఈ స్కీమ్ గడువు ప్రస్తుతం 5 సంవత్సరాలు కాగా మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖాతాలలో వడ్డీ జమవుతుంది. డబ్బులను మాత్రం మెచ్యూరిటీ తర్వాత మాత్రమే తీసుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ స్కీమ్ లో 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత 20.85 లక్షల రూపాయలు వస్తాయి.

తక్కువ సమయంలోనే ఏకంగా 6 లక్షల రూపాయల లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

తక్కువ సమయంలో రిస్క్ లేకుండా ఆకర్షణీయమైన రాబడి పొందాలని భావించేవాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందడంతో పాటు అవసరమైతే మెచ్యూరిటీ కాలన్ని మరింత ఎక్కువగా పొడిగించుకునే అవకాశం ఉంటుంది.