
రాజధాని లేని రాష్ట్రం.. అయినా కూడా కొన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న ప్రతిభ అబ్బురపరుస్తోంది. వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది. తాజాగా దేశంలోనే అరుదైన ఘనత సాధించింది. నీతి అయోగ్ తలపెట్టిన ‘ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం’లో 66.67శాతం మార్కులతో ఏపీ మూడో స్థానంలో నిలిచింది.
Also Read: ఏపీ కేబినెట్ : సీఎం జగన్ వరాలు ఇవీ
వెనుకబడిన జిల్లాల్లో కొన్ని కీలక రంగాల్లో పురోగతిని కేంద్రం పరిగణలోకి తీసుకుంది. విద్యా, వైద్యం, వ్యవసాయం జలవనరులు, ప్రాథమిక మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సమ్మిళితపరంగా దేశంలోని మిగతా జిల్లాల కంటే వెనుకబడిన 112 జిల్లాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నీతి అయోగ్ ఈ కార్యక్రమం చేపట్టింది.
ఈ కార్యక్రమంలో చేరకముందు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పటికీ చత్తిస్ ఘడ్ 80శాతం, ఒడిషా 70శాతం, ఆంధ్రప్రదేశ్ 66.67శాతం, ఝార్ఖండ్ 63శాతం పురోగతి సాధించి తొలి నాలుగు స్థానాల్లో నిలిచినట్లు నివేదిక పేర్కొంది.
Also Read: అసెంబ్లీ ఫైట్: టీడీపీ మీడియాతో జగన్ ను కొట్టే ప్లాన్?
2018లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ఎంత మేరకు పరిస్థితుల్లో మార్పు వచ్చిందో తెలుసుకోవడానికి ఇటీవల అధ్యయనం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏకంగా దేశంలోనే 3వ స్థానంలో నిలవడం విశేషం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్