https://oktelugu.com/

AP: ఏపీలో రహస్య జీవోల పాలన మతలబేమిటి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో రహస్య జీవోల పాలన సాగుతోంది. ఏ విషయం కూడా అందరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు కాన్ఫిడెన్షియల్, బ్లాంక్ జీవోలు తీసుకొస్తూ ఎవరికి దొరకకుండా చూసుకుంటోంది ఇకపై జీవోలు ఏపీ పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదని సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముత్యాలరాజు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక జీవోలన్నీ ఆఫ్ లైన్ లో అధికారుల మధ్యే ఉండే అవకాశాలున్నాయి. ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2021 / 07:23 PM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో రహస్య జీవోల పాలన సాగుతోంది. ఏ విషయం కూడా అందరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు కాన్ఫిడెన్షియల్, బ్లాంక్ జీవోలు తీసుకొస్తూ ఎవరికి దొరకకుండా చూసుకుంటోంది ఇకపై జీవోలు ఏపీ పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదని సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముత్యాలరాజు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక జీవోలన్నీ ఆఫ్ లైన్ లో అధికారుల మధ్యే ఉండే అవకాశాలున్నాయి. ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియడంతో పెద్ద దుమారమే చెలరేగుతోంది.

    ఈ నేపథ్యంలో ఏపీ రహస్య పద్ధతి పాటించేందుకు నిర్ణయించింది. జీవోలన్నీ బయటకు తెలియడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బ్లాంక్ జీవోలతో రహస్య పాలన చేస్తోందని టీడీపీ గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జీవోలను ఇకపై ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలని భావిస్తోంది. జీవోలను ఇక పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చూడాలని సంకల్పించింది ఇన్నాళ్లు పారదర్శకతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్ లలో ఉంచుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా చేసింది.

    ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లలో పెట్టడం వల్ల ప్రభుత్వ విషయాలన్ని బహిర్గతం కావడంతో ప్రభుత్వం అబాసుపాలైంది. దీంతో పారదర్శకతకు పాతరేసి రహస్య పద్దతికే ఓటు వేయాలని నిర్ణయించింది. జీవోలు, చెల్లింపులు సీక్రెట్ గా ఉంచాలని చూస్తోంది. పారదర్శకతతో సమస్యలు ఎదురవుతున్నాయని గ్రహించింది. గతంలో జగన్ ఇచ్చిన హామీని సైతం పక్కన పెట్టి జీవోల్లో ఏముందో తెలియకుండా ఉంచాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ చర్యలేవీ ఇతరుకు చేరకుండా చూడాలని నిర్ణయించింది.

    ప్రభుత్వ చర్యలతో ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి. అసలు రాష్ర్టంలో ఏం జరుగుతుందని ప్రశ్నిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో సీక్రెట్ లు పాటిస్తూ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియకుండా చేస్తూ మోసాలకు పాల్పడుతుందని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ రహస్యాలు బయటపెట్టి మరీ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.